https://oktelugu.com/

Karnataka Election Results 2023 : కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపునకు ప్రధాన కారణం అదే

Karnataka Election Results 2023  : కర్ణాటకలో బిజెపి కావచ్చు, తెలంగాణలో బీఆర్ఎస్ కావచ్చు.. ప్రతిపక్షాలను అణగదొక్కడంలో వాటికి అవే సాటి. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలానే చేసింది. కాకపోతే కాంగ్రెస్ ప్రతిపక్షంలోకి మారిన తర్వాత ఒకప్పుడు దానివల్ల ఇబ్బంది పడిన పార్టీలు అంతకుమించి అనేలాగా చేశాయి. ఒక దశ వరకు ఇవి బాగున్నప్పటికీ అవి రాను రాను కాస్త శృతిమించడంతో జనాలకు ఏవగింపు కలిగింది. పైగా కర్ణాటకలో అధికార భారతీయ జనతా పార్టీ […]

Written By:
  • NARESH
  • , Updated On : May 19, 2023 / 10:08 PM IST
    Follow us on

    Karnataka Election Results 2023  : కర్ణాటకలో బిజెపి కావచ్చు, తెలంగాణలో బీఆర్ఎస్ కావచ్చు.. ప్రతిపక్షాలను అణగదొక్కడంలో వాటికి అవే సాటి. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలానే చేసింది. కాకపోతే కాంగ్రెస్ ప్రతిపక్షంలోకి మారిన తర్వాత ఒకప్పుడు దానివల్ల ఇబ్బంది పడిన పార్టీలు అంతకుమించి అనేలాగా చేశాయి. ఒక దశ వరకు ఇవి బాగున్నప్పటికీ అవి రాను రాను కాస్త శృతిమించడంతో జనాలకు ఏవగింపు కలిగింది. పైగా కర్ణాటకలో అధికార భారతీయ జనతా పార్టీ నాయకులు అతిగా ప్రవర్తించడం, అవినీతి ఆరోపణలు తారాస్థాయికి చేరడంతో జనాల్లో వ్యతిరేకత పెరిగింది.. ఆ వ్యతిరేకతను ఉద్యమాలుగా మలచడంలో కాంగ్రెస్ పార్టీ విజయవంతమైంది. ముఖ్యంగా గ్రూపులుగా విడిపోయిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో కలిసికట్టుగా పని చేయడమే ఇక్కడ విశేషంగా చెప్పుకోవాలి.

    ఇక కర్ణాటకలో బసవరాజు ప్రభుత్వంపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు వచ్చాయి. అయితే ఎన్నికలకు ముందు బసవరాజును పదవి నుంచి తొలగిస్తారని ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. గుజరాత్ రాష్ట్రం మాదిరే ఇక్కడ కూడా ప్రయోగాలు చేస్తారని రాజకీయ విశ్లేషకులు భావించారు. టికెట్ విషయంలో కొత్తవారికి అవకాశం కల్పించిన భారతీయ జనతా పార్టీ.. ముఖ్యమంత్రి మార్పు విషయంలో అటువంటి కీలక నిర్ణయం తీసుకోలేకపోయింది. దీనికి తోడు ఎన్నికలకు ముందు అక్కడి లోకాయుక్తకు అధికార పార్టీ ఎమ్మెల్యే డబ్బు సంచులతో దొరికిపోవడం భారతీయ జనతా పార్టీని ఇరుకున పెట్టింది. హిజాబ్, అమూల్, కేరళ స్టోరీస్, బజరంగబలి, బజరంగ్ దళ్ వంటి వివాదాలు తెరపైకి వచ్చినప్పటికీ భారతీయ జనతా పార్టీని గెలిపించలేకపోయాయి..

    స్థానిక సమస్యలు, అవినీతి ఆరోపణలు బలంగా పనిచేయడం, వాటిని కాంగ్రెస్ నాయకులు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో అక్కడ అధికార మార్పు సాధ్యమైంది. ఇక ఈ తీర్పు ద్వారా కర్ణాటక ఓటర్లు ఈ ప్రభుత్వాన్ని కూడా రెండవసారి ఎన్నుకోరని రుజువు చేశారు.

    కర్ణాటక ఎన్నికల ఫలితాలపై రామ్ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు..