https://oktelugu.com/

Naresh – Pavitra Lokesh : నాలుగో పెళ్లి ప్రకటన చేసిన నరేష్..!

సుప్రీంకోర్టు విడాకుల విషయంలో చేసిన తీర్పుపై నరేష్ హర్షం వ్యక్తం చేశాడు. నాలాంటి వాళ్ళ బాధ అర్థం చేసుకొని కోర్టు కీలక ప్రకటన చేసినట్లు సంబరపడ్డారు. మారిన నిబంధనలు నరేష్ కి అనుకూలంగా ఉన్న నేపథ్యంలో పెళ్ళికి సిద్దమయ్యాడేమో.

Written By:
  • NARESH
  • , Updated On : May 19, 2023 / 08:20 PM IST

    Naresh Pavitra Lokesh Marriage

    Follow us on

    Naresh – Pavitra Lokesh : నటుడు నరేష్ ఒక్కో కామెంట్ సెన్సేషన్ అవుతున్నాయి. తాజాగా ఆయన నాలుగో పెళ్లి ప్రకటన చేశారు. నరేష్ లేటెస్ట్ మూవీ మళ్ళీ పెళ్లి. పవిత్ర లోకేష్, నరేష్ ప్రధాన పాత్రలు చేశారు. ఈ మూవీ మే 26న విడుదల కానుంది. తెలుగుతో పాటు కన్నడలో కూడా విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ కోసం బెంగుళూరు వెళ్లారు. అక్కడ మీడియా పవిత్ర లోకేష్ ని మీరు వివాహం చేసుకున్నారా? అని అడిగారు. నరేష్ స్పందిస్తూ… పవిత్ర లోకేష్ ని నేను వివాహం చేసుకోలేదు. అయితే త్వరలో పెళ్లి చేసుకుంటాను. మా ఇద్దరి మనసులు కలిశాయి. అందుకే కలిసి జీవిస్తున్నాము, అన్నారు.

    ఇక పెళ్లి కచ్చితంగా చేసుకోవాలనే నిబంధన లేదు. చాలా మంది జంటలు ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకున్నామనే కారణంతో బతుకుతున్నారు. అలాంటి వాళ్ళ కోసమే మళ్ళీ పెళ్లి చిత్రం అన్నారు. నరేష్ కామెంట్స్ వైరల్ గా మారాయి. నరేష్ కి మూడో భార్య రమ్య రఘుపతితో వివాదం ఉంది. అధికారికంగా విడాకులు మంజూరు కాలేదు. భార్య ఉండగా మరొక వివాహం చేసుకోవడం చట్టరీత్యా నేరం. నరేష్ మాత్రం నాలుగో పెళ్ళికి రెడీ అంటున్నారు.

    ఇటీవల సుప్రీం కోర్టు విడాకుల విషయంలో చేసిన తీర్పుపై నరేష్ హర్షం వ్యక్తం చేశాడు. నాలాంటి వాళ్ళ బాధ అర్థం చేసుకొని కోర్టు కీలక ప్రకటన చేసినట్లు సంబరపడ్డారు. మారిన నిబంధనలు నరేష్ కి అనుకూలంగా ఉన్న నేపథ్యంలో పెళ్ళికి సిద్దమయ్యాడేమో. రమ్య రఘుపతితో నరేష్ విడిపోయి ఏడెనిమిదేళ్లు అవుతుంది. ఓ నాలుగేళ్ళ నుండి పవిత్ర లోకేష్ తో సహజీవనం చేస్తున్నాడు.

    గత ఏడాది నరేష్-పవిత్ర లోకేష్ మేటర్ బయటకొచ్చింది. ఇద్దరు కలిసి మహాబలేశ్వర్ ఆలయం సందర్శించారు. ప్రత్యేక పూజలు చేశారు. దాంతో నరేష్-పవిత్ర లోకేష్ వివాహం చేసుకున్నారన్న ప్రచారం జరిగింది. నరేష్ ఈ వార్తలపై స్పష్టత ఇచ్చాడు. మాకు వివాహం కాలేదు. అయితే కలిసి జీవిస్తున్నాము అన్నాడు. వివాహ వ్యవస్థపై నాకు నమ్మకం లేదు. ప్రస్తుతానికి పెళ్లి ఆలోచన లేదు. భవిష్యత్ లో చేసుకుంటానేమో చెప్పలేను అన్నారు.