Janasena and BJP : జనసేన-బీజేపీ మధ్య కోల్డ్ వార్ నడుస్తోందా? దీనిపై అనేక సందేహాలు ఎక్కువమందికి ఉన్నాయి. బీజేపీతో జనసేన పొత్తు పొడిచిన మొదట్లో అంతా బాగానే ఉందనుకున్నారు. సోము వీర్రాజు బీజేపీ ఏపీ అధ్యక్షుడయ్యాక పవన్ కళ్యాణ్ యే మా కూటమికి నాయకుడు అని ప్రకటించారు. పవన్ ను సీఎం క్యాండిడేట్ గా అని ఫోకస్ చేశారు.

మరి ఇప్పుడు ఎక్కడ బీజేపీతో జనసేనకు చెడింది.. ఇప్పుడు ఎందుకు పవన్ ను గుర్తించడం లేదన్నది ప్రశ్న. బీజేపీ-జనసేన కలిసి పోరాటం చేయడం లేదు. జనసేన ఆవిర్భావ సభకు బీజేపీని పిలవలేదు. ఇటీవల రాజమండ్రికి వచ్చిన జేపీ నడ్డా మీటింగ్ కు జనసేనను ఆహ్వానించలేదు.
రెండూ స్వతంత్ర పార్టీలు.. అన్ని అంశాల్లో బీజేపీ, జనసేనకు ఏకాభిప్రాయం లేదు. విశాఖ ఉక్కు విషయంలో జనసేన వ్యతిరేకించగా.. బీజేపీ మద్దతుగా తెలిపింది.. బీహార్ లో జేడీయూ, బీజేపీకి విభేదాలున్నా కలిసి ప్రభుత్వంలో ఉన్నాయి. స్వతంత్ర్య అభిప్రాయలున్నంత మాత్రాన జనసేన-బీజేపీ మధ్య చెడింది అనడానికి లేదు.
మరి ఎందుకు బీజేపీ, జనసేన మధ్య కోల్డ్ వార్ వచ్చిందంటే.. మూడు కారణాలున్నాయి. జనసేనాని పవన్ కళ్యాణ్ ఉద్దేశంలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అన్నారు. దీంతో టీడీపీతోనూ అవసరమైతే పొత్తుకు పవన్ సై అన్నారు. తర్వాత జేపీ నడ్డాతో సీఎం క్యాండిడేట్ గా పవన్ ను ప్రకటించకపోవడంతో పవన్ నొచ్చుకున్నారు. బీజేపీ-వైసీపీ సంబంధాలపై జనసేన గుర్రుగా ఉంది. రాష్ట్రపతి ఎన్నికలు, రాజ్యసభ లో బలం కోసం వైసీపీ మద్దతును బీజేపీ కోరుతోంది.
బీజేపీ-జనసేన కోల్డ్ వార్ పై ఈ మూడు అంశాలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు..
[…] […]
[…] […]
[…] […]