BJP vs KCR: తన పరువు తానే తీసుకుంటున్న కేసీఆర్!
BJP vs KCR: దేశంలోని పవర్ ఫుల్ వ్యక్తులంతా హైదరాబాద్ కు వస్తే అది మన భాగ్యనగారికి ఎంత గొప్పతనం. ప్రధాని మోడీ నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. కేంద్రమంత్రులు, మొత్తం కేబినెట్, 10 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీజేపీ వచ్చి హైదరాబాద్ లో విడిది చేస్తే అది మన నగరానికి ఎంత గొప్ప గౌరవం. అంతటి మౌళిక వసతులు, సదుపాయాలు ఢిల్లీ తర్వాత మన దగ్గర ఉన్నాయని తేటతెల్లం అవుతుంది కదా. అతడి గొప్ప అవకాశాన్ని […]

BJP vs KCR: దేశంలోని పవర్ ఫుల్ వ్యక్తులంతా హైదరాబాద్ కు వస్తే అది మన భాగ్యనగారికి ఎంత గొప్పతనం. ప్రధాని మోడీ నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. కేంద్రమంత్రులు, మొత్తం కేబినెట్, 10 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీజేపీ వచ్చి హైదరాబాద్ లో విడిది చేస్తే అది మన నగరానికి ఎంత గొప్ప గౌరవం. అంతటి మౌళిక వసతులు, సదుపాయాలు ఢిల్లీ తర్వాత మన దగ్గర ఉన్నాయని తేటతెల్లం అవుతుంది కదా. అతడి గొప్ప అవకాశాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ చేజేతులారా పొగొట్టుకున్నాడని చెప్పకతప్పదు.

KCR- PM Modi
హైదరాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం నిర్వహిస్తుండడంతో ఇప్పుడు జాతీయ మీడియా మొత్తం హైదరాబాద్ పై ఫోకస్ చేసింది. ఒక దక్షిణాది నగరానికి ప్రధాని, కేంద్రమంత్రులు, 10 మంది సీఎంలు ఉండేంత సౌకర్యాలు, వసతులు ఉండడం.. పైగా హైదరాబాద్ లో దేశ ప్రధాని రెండు రోజులు బస చేయనుండడంతో అందరి ఫోకస్ ఇక్కడే నెలకొంది. ఇది హైదరాబాద్ కు మోడీ ఇచ్చిన గౌరవం అని చెప్పొచ్చు. హైదరాబాద్ ఖ్యాతి మొత్తం ఇనుమడిస్తుంది. దేశంలోని ప్రఖ్యాత మీడియా, జర్నలిస్టులు అందరూ ఇక్కడే బస చేస్తారు.
Also Read: Plastic Ban: ప్లాస్టిక్ పై కేంద్రం సంచలన నిర్ణయం.. ఇక వాడలేరు
ఒకరకంగా చెప్పాలంటే ఈ రెండూ రోజులు దేశ పాలన అంతా హైదరాబాద్ కేంద్రంగానే సాగనుంది. అలాంటి ప్రతిష్టాత్మక బీజేపీ పండుగకు మరిన్ని సౌకర్యాలు, వసతులు కల్పించాల్సింది పోయి తెలంగాణ సీఎం కేసీఆర్ పుల్లలు పెడుతుండడమే ఇప్పుడు అందరికీ షాక్ కలిగిస్తోంది. బీజేపీ తనకు పోటీగా తెలంగాణలో విస్తరించడాన్ని జీర్ణించుకోలేకపోతున్న కేసీఆర్.. ఇప్పుడు బీజేపీ జాతీయ కార్యక్రమాలకు అడుగడుగునా అడ్డుతగులుతున్నారు. దీన్ని జీర్ణించుకోలేని కేసీఆర్ పోటీగా ఈరోజే యశ్వంత్ సిన్హా ర్యాలీ పెట్టారు. బీజేపీ ఎప్పుడో పెట్టిన సభకు పోటీగా కేసీఆర్ బీరాలకు పోయి ఇప్పుడు టీఆర్ఎస్ ర్యాలీ పెట్టి ప్రజలను ఇబ్బందులు పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మోడీ సభతో హైదరాబాద్ కు ఖ్యాతి వస్తే.. దాన్ని మరింతగా ప్రొజెక్ట్ చేసుకోకుండా బీజేపీ శ్రేణులకు ఇబ్బంది పెట్టేలా పోటీ కార్యక్రమాలు నిర్వహించడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.

KCR- PM Modi
ఎలాగైనా సరే బీజేపీ సభలు, సమావేశాలకు ప్రజల్లో మైలేజ్ రాకుండా ఉండేందుకు టీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేస్తోంది. రకరకాల ఎత్తులు వేస్తోంది. మీడియాకు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చి బీజేపీకి స్కోప్ లేకుండా చేస్తోంది. హైదరాబాద్ లో హోర్డింగ్ లన్నింటిని టీఆర్ఎస్ పథకాలతో నింపేసింది. అసలు బీజేపీ కాషాయ జెండాలు కనిపించకుండా హైదరాబాద్ లో గులాబీ జెండాలను పాతేశారు. పోటీపోటీగా సాగుతున్న ఈఫైట్ వేళ కేసీఆర్ తెలంగాణ పరువును తానే తీస్తున్నాడన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
మోడీ తెలంగాణకు వచ్చి ఇక్కడి ఖ్యాతిని దేశానికి వినిపించే ప్రయత్నం చేస్తే.. కేసీఆర్ మాత్రం బీజేపీకి అడ్డుతగులుతూ ఉన్న పరువును పోయేలా చేస్తున్నాడని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా బీజేపీ మీటింగ్ లకు అడ్డంకులు సృష్టించకుండా స్వేచ్ఛగా ఉండనిస్తే హైదరాబాద్ కు మరింత ప్రతిష్ట వస్తుందని పలువురు హితవు పలుకుతున్నారు.
Also Read:Janasena and BJP : జనసేన-బీజేపీ మధ్య కోల్డ్ వార్ నిజమా? అసలేం జరుగుతోంది?
