AAP Attains National Party Status : ఇటీవల గుజరాత్ ఎన్నికల్లో వ్రతం చెడినా ఆప్ పార్టీకి ఫలితం దక్కింది. గుజరాత్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయినా కూడా దానికి వచ్చిన ఓట్ల శాతంతో దేశంలో 9వ జాతీయ పార్టీగా అవతరించింది. దేశ రాజకీయాలను ఆప్ షేక్ చేయబోతోందా? ఆప్ భవిష్యత్ ఎలా ఉండబోతోంది.
ప్రస్తుతానికి దేశంలో బీజేపీ, కాంగ్రెస్ మాత్రమే యాక్టివ్ జాతీయ పార్టీలు. కానీ మొత్తంగా చూస్తే దేశంలో 8 జాతీయ పార్టీలున్నాయి. కొంత మేరకు బీఎస్పీ యాక్టివ్ గా ఉంది. మిగతావన్నీ నామమాత్రపు పార్టీలే. ఎన్సీపీ, సీపీఐ, సీపీఎం, టీఎంసీ, నేషనల్ పీపుల్స్ పార్టీ (ఈశాన్యరాష్ట్రాల పార్టీ)లు ఉన్నాయి.
జాతీయ పార్టీగా గుర్తింపు వస్తే ఉపయోగం ఉంటుందా? అన్నది పరిశీలిస్తే.. దేశవ్యాప్తంగా జాతీయ పార్టీలకు ఒకటే ఎన్నికల గుర్తును ఎన్నికల కమిషన్ ఇస్తుంది. ఇక ఏ పార్టీకి ఆ గుర్తును కేటాయించరు. ఇది పెద్ద ఉపయోగం. హెడ్ క్వార్టర్స్ లో ఒక ఉచిత స్థలం ఇస్తారు. బిల్డింగ్ ఇస్తారు. ఈసీ ద్వారా గుర్తింపు రావడమే ప్రధానమని చెప్పొచ్చు.
జాతీయ పార్టీలు ఉన్నా వాటికి జాతీయ స్థాయిలో ప్రజల మద్దతు ఉండాలి. 2019 ఎన్నికల తర్వాత నేషనల్ కాంగ్రెస్ పార్టీ, సీపీఐ, టీఎంసీలకు మూడు పార్టీలకు ఈసీ నోటీసులు ఇచ్చింది. మీ జాతీయ పార్టీల గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదని ప్రశ్నించింది. మేం పెట్టుకున్న నిబంధనల ప్రకారం మీరు పోటీచేయలేదు.. ఓట్లు సంపాదించలేదని.. అందుకే మీ జాతీయ గుర్తింపును రద్దు చేస్తామంటూ నోటీసులు ఇచ్చింది. దీనికి ఆయా పార్టీలు 2024 వరకూ గడువు ఇవ్వాలని కోరడంతో ఇది హోల్డ్ లో పడబోతోంది.
ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీగా ఎదిగితే కాంగ్రెస్ కే ఎఫెక్ట్ పడనుంది. ఆప్ కు పడే ఓట్లన్నీ కాంగ్రెస్ వే. బీజేపీకి ప్రత్యామ్మాయంగా ఎదగాలన్నది ఆమ్ ఆద్మీ వ్యూహం. మరి ఇది సాధ్యమవుతుందా? ఆప్ జాతీయ పార్టీ భవిష్యత్ ఎలా ఉండబోతోందన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు.