NTR- Koratala Siva Movie: #RRR వంటి సంచలన విజయం తర్వాత తమ హీరో ఇప్పటి వరుకు ఒక్క సినిమాని కూడా ప్రారంభించలేదని ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా నిరాశలో ఉన్నారు..’అరవింద సమేత వీరరాఘవ’ చిత్రం తర్వాత ఎన్టీఆర్ నుండి ఇప్పటి వరుకు సోలో హీరో గా ఒక్క సినిమా కూడా విడుదల అవ్వలేదు..ఇక మూడేళ్ళ పాటు కాల్ షీట్స్ ని కేటాయించిన #RRR చిత్రం లో మెయిన్ లీడింగ్ పాత్ర రామ్ చరణ్ చెయ్యడం..ఎన్టీఆర్ పాత్ర కి ఫ్యాన్స్ సంపూర్ణ స్థాయి లో తృప్తి చెందకపోవడం వంటివి మనం చూస్తూనే ఉన్నాము.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఇప్పుడు అర్జెంటు గా ఒక సినిమా కావాలి..కానీ #RRR విడుదలై 9 నెలలు గడుస్తున్నా కొరటాల శివ తో చెయ్యాల్సిన సినిమా ఇప్పటి వరుకు కనీసం పూజా కార్యక్రమాలు కూడా జరుపుకోలేదు..మరో పక్క #RRR లో ఎన్టీఆర్ తో పాటు చేసిన మరో హీరో రామ్ చరణ్ మాత్రం శంకర్ తో సినిమాని ప్రారంభించి సగానికి పైగా షూటింగ్ కూడా పూర్తి చేసేసాడు.
కానీ ఎన్టీఆర్ – కొరటాల శివ సినిమా పరిస్థితి ఏంటో ఎవరికీ తెలియదు..ఎప్పుడు ప్రారంభం అవుతుందో కూడా క్లారిటీ లేదు..ఆచార్య సినిమా ఫ్లాప్ అవ్వడం తో తాను తర్వాత తియ్యబోయ్యే సినిమాతో ఎలా అయినా తన సత్తా చాటాలని ఉద్దేశ్యం తోనే స్క్రిప్ట్ విషయం లో ఎక్కడా రాజీపడకుండా..ఒకటికి పది సార్లు ఆలోచించి రాస్తున్నాడట..అందుకే ఇంత సమయం తీసుకుంటున్నాడట.

ఎన్టీఆర్ కూడా ఈ ఖాళీ సమయాన్ని సంపూర్ణంగా ఎంజాయ్ చేస్తున్నాడు..కుటుంబం తో కలిసి ఆయన ఫారిన్ ట్రిప్స్ తిరుగుతున్నాడు..అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఇప్పుడు ఒక వార్త పూనకాలు రప్పించేలా చేస్తుంది..అదేమిటి అంటే ఈ సినిమా లో ఎన్టీఆర్ చేతికి ఆరు వేళ్ళు ఉంటాయట..ఆయనకీ కోపం వచ్చినప్పుడల్లా ఆరవ వేలు బిగుసుకుపోతుందట..ఆయుధం లాగ మారిపోతుందట..ఇలా ఎన్టీఆర్ ని ఇదివరకు ఇండియన్ ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై అంతకుముందు ఎవ్వరు చూడనంత పవర్ ఫుల్ గా చూపించబోతున్నాడట కొరటాల శివ..పాన్ ఇండియా లెవెల్ లో అన్ని ప్రాంతీయ బాషలలో విడుదల అవ్వబోతున్న ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లోనే మైలురాయిగా నిలిచిపోతుందని కొరటాల శివ బలంగా నమ్ముతున్నాడట.