అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ.1,100కే కొత్త స్మార్ట్‌ఫోన్..?

ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్ కొత్తగా స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలని అనుకునే వారికి అదిరిపోయే శుభవార్త చెప్పింది. కొత్త ఈఎంఐ స్కీమ్‌ ద్వారా తక్కువ ఈఎంఐ చెల్లించి స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తోంది. అడ్వాంటేజ్ నో కాస్ట్ ఈఎంఐ ద్వారా తక్కువ ఈఎంఐ చెల్లించి స్మార్ట్ ఫోన్ ను అమెజాన్ వెబ్ సైట్ లేదా యాప్ ద్వారా ఆర్డర్ చేయవచ్చు. అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు మాత్రమే కొత్త ఈఎంఐ స్కీమ్ ద్వారా […]

Written By: Kusuma Aggunna, Updated On : February 5, 2021 2:56 pm
Follow us on

ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్ కొత్తగా స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలని అనుకునే వారికి అదిరిపోయే శుభవార్త చెప్పింది. కొత్త ఈఎంఐ స్కీమ్‌ ద్వారా తక్కువ ఈఎంఐ చెల్లించి స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తోంది. అడ్వాంటేజ్ నో కాస్ట్ ఈఎంఐ ద్వారా తక్కువ ఈఎంఐ చెల్లించి స్మార్ట్ ఫోన్ ను అమెజాన్ వెబ్ సైట్ లేదా యాప్ ద్వారా ఆర్డర్ చేయవచ్చు. అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు మాత్రమే కొత్త ఈఎంఐ స్కీమ్ ద్వారా ప్రయోజనం చేకూరుతుంది.

Also Read: ఆ ఊరిలో ఆకుకూరలు అమ్ముతున్న సర్పంచ్.. ఎందుకంటే..?

సాధారణంగా చాలామంది క్రెడిట్ కార్డుల సహాయంతో కొత్త ఈఎంఐలు చెల్లించి స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేస్తారు. అయితే అలా కాకుండా కొత్త ఈఎంఐ స్కీమ్ ద్వారా స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేస్తే నెలవారీ ఈఎంఐ భారాన్ని దాదాపు సగం వరకు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఎంపిక చేసిన స్మార్ట్ ఫోన్లను అమెజాన్ ప్రైమ్ మెంబర్లు కొనుగోలు చేయడం ద్వారా తక్కువ మొత్తం ఈఎంఐ చెల్లించి స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేయవచ్చు.

Also Read: ఎల్‌ఐసీ పాలసీ.. రోజుకు రూ.121 ఆదాతో రూ.27 లక్షలు..?

అమెజాన్ ఎంపిక చేసిన స్మార్ట్ ఫోన్లలో ఒకటైన ఒప్పో ఏ 15ను కొనుగోలు చేస్తే 1,100 రూపాయలు ఈఎంఐ చెల్లించడం ద్వారా స్మార్ట్ ఫోన్ ను పొందవచ్చు. శాంసంగ్ ఫైండ్ ఎక్స్2 స్మార్ట్ ఫోన్, శాంసంగ్ గెలాక్సీ ఎఫ్17, ఎఫ్17ప్రో, ఒప్పో ఏ15, ఏ1కే ఫోన్లు, ఐ ఫోన్ 12 మినీ, శాంసంగ్ గెలాక్సీ ఎం21, ఎం31ఎస్, ఎం51 మోడళ్లను కొత్త ఈఎంఐ స్కీమ్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. అయితే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డు ఉంటే మాత్రమే ఈ ప్రయోజనాలను పొందవచ్చు.

మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

రెగ్యులర్ కస్టమర్లు చెల్లించే ఈఎంఐతో పోలిస్తే తక్కువ మొత్తం ఈఎంఐ చెల్లించడం ద్వారా ఈ ఆఫర్ పొందే అవకాశం ఉండటంతో అమెజాన్ ప్రైమ్ యూజర్లు కొత్త ఈఎంఐ స్కీమ్ పై ఆసక్తి చూపుతారని అమెజాన్ సంస్థ భావిస్తోంది.