https://oktelugu.com/

ఎన్నికల ‘పంచాయితీ’లో ప్రభుత్వ వాదన కరక్టేనా!

ఏపీ పంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ మధ్య మొన్నటి వరకు టామ్ అండ్ జెర్రీ ఫైట్ సాగింది. తామంటే తామేనని అటు జగన్ .. ఇటు కమిషనర్ నిమ్మగడ్డ ప్రసాద్ ఎవరికి వారే పట్టుబట్టి కూర్చున్నారు. వీరి ‘పంచాయితీ’సుప్రీంకెక్కడంతో చివరికీ నిమ్మగడ్డదే పైచేయి అని నిరూపించుకున్నాడు. సుప్రీం తీర్పుతో నిమ్మగడ్డతో పాటు ప్రతిపక్షాలు సైతం సంబరాలు చేసుకున్నాయి. ఎందుకంటే ఎలక్షన్ విషయంలో ప్రభుత్వ తీరు తప్పిదమేనని సుప్రీం కోర్టే తేల్చిందని.. దీంతో ప్రజలు సైతం ప్రభుత్వానికి […]

Written By:
  • NARESH
  • , Updated On : February 5, 2021 / 12:42 PM IST
    Follow us on

    ఏపీ పంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ మధ్య మొన్నటి వరకు టామ్ అండ్ జెర్రీ ఫైట్ సాగింది. తామంటే తామేనని అటు జగన్ .. ఇటు కమిషనర్ నిమ్మగడ్డ ప్రసాద్ ఎవరికి వారే పట్టుబట్టి కూర్చున్నారు. వీరి ‘పంచాయితీ’సుప్రీంకెక్కడంతో చివరికీ నిమ్మగడ్డదే పైచేయి అని నిరూపించుకున్నాడు. సుప్రీం తీర్పుతో నిమ్మగడ్డతో పాటు ప్రతిపక్షాలు సైతం సంబరాలు చేసుకున్నాయి. ఎందుకంటే ఎలక్షన్ విషయంలో ప్రభుత్వ తీరు తప్పిదమేనని సుప్రీం కోర్టే తేల్చిందని.. దీంతో ప్రజలు సైతం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారుతారని టీడీపీ, ఇతర పార్టీలు అంటున్నాయి. కానీ ఇక్కడ ప్రభుత్వంపై వ్యతిరేకత కాకుండా ప్రజలు సపోర్టు చేస్తున్నారని కొందరు వాదిస్తున్నారు. ఎందుకో ఇక్కడ చదవండి..

    కరోనా వైరస్ వ్యాక్సినేషన్ నేపథ్యంలో సిబ్బంది ఎక్కువ శాతం ఆ కార్యక్రమాల్లోనే పాల్గొంటారు. దీంతో ఎన్నికలకు సిబ్బంది సరిపోరని ప్రభుత్వం వాదించింది. ఎన్నికలకంటే తమకు ప్రజా ప్రయోజనాలే ముఖ్యమని చెప్పింది. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా ధాటికి ఎందరో ఉద్యోగులు తమ ప్రాణాలను వదిలారని, ఇప్పడు ఎలక్షన్ సందర్భంగా వారి ఆరోగ్యాలను దెబ్బతీయలేమని చెప్పింది. వ్యాక్సినేషన్ పూర్తయిన తరువాత ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వ ప్రతినిధులు చెప్పారు.

    ఇదిలా ఉండగా కరోనా ఉధృతి ఎక్కువగా ఉన్న సమయంలోనే పలు రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించారని, కోవిడ్ నిబంధనలతో ఎలక్షన్ నిర్వహించుకోవచ్చని ఎలక్షన్ కమిషన్ చెప్పుకొచ్చింది. రాజ్యాంగం ప్రకారం ఎన్నికలకు ప్రభుత్వం, అధికారులు ఎన్నికలకు సహకరించాలని సరైన సమయంలోనే ఎన్నికలు నిర్వహిస్తేనే ప్రజాస్వామ్యాన్ని రక్షించగలుగుతామని వాదించింది.

    ఎవరివాదన ఎలా ఉన్న న్యాయపరంగా చూస్తే ఎన్నికల నిర్వహణకే సుప్రీం మొగ్గు చూపడంతో అధికారులు ఆ ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే ప్రభుత్వం ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వాదించడంతో సామాన్యులు ప్రభుత్వంపై సింపతీ చూపిస్తారని అధికార పార్టీ నాయకులు అంటున్నారు. ప్రజారోగ్యం దృష్టిలో పెట్టుకొని ఉండడంతో వారి మద్దతు తమకే ఉంటుందుని అంటున్నారు. ప్రతిపక్షాలు ఎలక్షన్ కమిషన్ తో ఎన్ని కుయుక్తులు ప్రదర్శించిన ప్రజాబలం వైసీపీకే ఉంటుందని అంటున్నారు. మరి చివరికి ప్రజా బలం ఎవరికుందో తేలాలంటే ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేవరకు వేచి ఉండాల్సిందే.