Homeఆంధ్రప్రదేశ్‌CM Jagan New Cabinet Portfolios: ఏపీ కొత్త మంత్రులకు కేటాయించిన శాఖలు.. రోజా హోం...

CM Jagan New Cabinet Portfolios: ఏపీ కొత్త మంత్రులకు కేటాయించిన శాఖలు.. రోజా హోం మినిస్టర్ కాదు.. ఏ శాఖంటే?

CM Jagan New Cabinet Portfolios ఏపీలో కొత్త మంత్రులు కొలువుదీరారు. జగన్ సీనియారిటీని.. అలాగే ఫైర్ బ్రాండ్లను ఈసారి తన అమ్ముల పొదిలో చేర్చుకున్నారు. ముఖ్యంగా మాటల తూటాలు పేల్చగల ఫేమస్ నేతలు రోజా, అంబటి రాంబాబు, జోగి రమేశ్ లు ఈసారి మంత్రులయ్యారు. రోజాకు హోంమంత్రి పదవి ఖాయమన్న ప్రచారం జోరుగా సాగుతోంది.. ఎవరికి ఏం కేటాయిస్తారన్నది ఆసక్తి రేపుతోంది. అందరికంటే ముందుగా తొలుత సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు మంత్రిగా ప్రమాణ స్వీకారం.. సీనియారిటీ ప్రకారం కాకుండా ‘ఆల్ఫాబెట్ ’ ప్రకారం వారి పేర్ల మొదటి అక్షర క్రమంలో ఈ ప్రమాణ స్వీకారోత్సవం జరగడం విశేషం.

అందరూ ఆసక్తిగా ఎదురుచూసిన ఫైర్ బ్రాండ్ రోజాకు పర్యాటకం, యువజన , సాంస్కృతిక శాఖ ఇచ్చారు. తొలి సారి మంత్రి అయినా కూడా యువ ఎమ్మెల్యే రజినీకి కీలకమైన వైద్య ఆరోగ్యశాఖను అప్పగించారు. ఎంతో కీలకమైన ఈ శాఖ ఆమె అనుభవం లేకుండా ఎలా నిర్వహిస్తారన్నది చూడాలి. ఇక భారీ నీటిపారుదల శాఖను తన సన్నిహితుడైన అంబటి రాంబాబుకు జగన్ కేటాయించారు.

-సీఎం జగన్ కొత్త మంత్రులకు కేటాయించిన శాఖలు ఇవీ
1-తానేటి వనిత-హోంశాఖ
2-బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి-ఆర్థిక శాఖ, శాసనసభా వ్యవహారాలు
3-ధర్మాన ప్రసాదరావు-రెవెన్యూ,రిజిస్ట్రేషన్ శాఖ
4-ఆర్కే రోజా:- పర్యాటక సాంస్కృతిక, యువజన శాఖ
5-విడుదల రజినీ: వైద్యశాఖ
6-నారాయణ స్వామి-ఎస్సైజ్ శాఖ
7-అంబటి రాంబాబు:- భారీ నీటి పారుదల శాఖ
8-జోగి రమేశ్-గృహ నిర్మాణ శాఖ
9-బొత్స సత్యనారాయణ- విద్యాశాఖ
10-ఉషశ్రీ చరణ్-స్త్రీ శిశు సంక్షేమం
11-సీదిరి అప్పలరాజు-మత్స్య, సమకార శాఖ
12-అంజాద్ భాషా-: మైనార్టీ శాఖ
13-కొట్టు సత్యనారాయణ-దేవాదాయ శాఖ
14-పినిపె విశ్రూప్-: రవాణా శాఖ
15-మేరుగా నాగార్జున-సాంఘిక సంక్షేమ శాఖ
16-ముత్యాల నాయుడు:-పంచాయితీరాజ్
17-పీడిక రాజన్న దొర-: గిరిజన సంక్షేమ శాఖ
18-దాడిశెట్టి రాజా-రోడ్లు, భవనాల శాఖ
19-పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి:-విద్యుత్, అటవీ, పర్యావరణ శాఖ
20-చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ: సాంఘిక సంక్షేమ శాఖ
21-ఆదిమూలపు సురేష్: మున్సిపల్, అర్బన్ డెవలప్ మెంట్
22-గుమ్మనూరు జయరాం:- కార్మిక శాఖ
23-గుడివాడ అమరానాథ్: పరిశ్రమలు, ఐటీశాఖ
24-కాకాణి గోవర్ధన్ రెడ్డి : వ్యవసాయ శాఖ
25. వేణుగోపాల్ : బీసీ సంక్షేమం సినిమాటోగ్రఫీ, సమాచార పౌరసంబంధాల శాఖ

గతంలో లాగానే ఐదుగురికి ఉప ముఖ్యమంత్రి పదవులు దక్కాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు వర్గాలకు ఉప ముఖ్యమంత్రి పదవులు దక్కాయి. మైనార్టీ నుంచి అంజాద్ బాషాకు డిప్యూటీ సీఎం గా ఎంపిక చేశారు. ఎస్టీ వర్గం నుంచి పీడిక రాజన్న దొర, ఎస్సీ నుంచి నారాయణ స్వామి డిప్యూటీ సీఎంలుగా నియమించారు. ఇక బూడి ముత్యాల నాయుడు, కొట్టు సత్యనారాయణలకు ఆయా సామాజిక సమీకరణాల ఆధారంగా డిప్యూటీసీఎం పదవులు కేటాయించారు.

ఇక మంత్రి పదవి ఇన్నాళ్లు అనుభవించి ఇప్పుడు దక్కకపోవడంతో అసంతృప్తి జ్వాల ఎగిసిపడింది. బాలినేని అసంతృప్తి వ్యక్తం చేయడంతో సీఎం జగన్ స్వయంగా పిలిపించారు. బాలినేని కొద్దిసేపటి క్రితమే జగన్ వద్దకు వెళ్లారు. ఇప్పటికే వైసీపీలో మొన్నటివరకూ హోంమంత్రిగా చేసిన మేకతోటి సుచరిత తాజాగా తనకు పదవి దక్కలేదని తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. మరికొంత మంది మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకోగా.. ఇంకొందరు అభిమానులు రోడ్లెక్కి నిరసనలు తెలుపుతున్నారు. దీంతో కొత్త కేబినెట్ తో జగన్ కు కొత్త తలనొప్పులు వచ్చాయని అంటున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

3 COMMENTS

  1. […] AP New Cabinet: వైసీపీలో క్రమశిక్షణ కట్టు తప్పుతుందా? సీఎం జగన్ ను కంటిమీద కునుకు లేకుండా చేస్తుందా? అనవసరంగా మంత్రివర్గ విస్తరణ పేరిట తేనె తుట్టను కదిలించానని అనుకుంటున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇన్నాళ్లు నోరుమెదపని నాయకులకు, అసమ్మతి మాటే అన్నది ఎరుగని ఆయన మంత్రి పదవులు దక్కలేదన్న అలకలు, అసంత్రుప్తులు, నేతల వ్యవహార శైలి చూసి నివ్వెరపోతున్నట్టు తెలుస్తోంది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సెగ ఆయనకు గట్టిగా తాకినట్లు కనిపిస్తోంది. పదవులు రానివారి అలకలు, విమర్శలు.. అనుచరుల ఆందోళనలు, రాజీనామాలపై సీఎం అసహనంగా ఉన్నట్లు తెలుస్తోంది. నాయకత్వాన్ని ధిక్కరించేంతగా అసమ్మతి రేగుతుందని ఆయన ఊహించనేలేదు. విధేయులుగా ఉన్నవారే తిరగబడడం విస్మయం కలిగిస్తోంది. […]

Comments are closed.

Exit mobile version