https://oktelugu.com/

Rajamouli Mahesh Babu Movie Story: రాజమౌళి- మహేష్ బాబు మూవీ స్టోరీ లైన్ ఇదే..!

Rajamouli Mahesh Babu Movie Story: ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో రాజమౌళి సినిమా అంటేనే ఒక్క ప్రభంజనం..ఆయనతో సినిమాలు చెయ్యడానికి పెద్ద పెద్ద సూపర్ స్టార్లు సైతం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు, బాహుబలి తర్వాత ఆయన చేసిన #RRR చిత్రం ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించడంతో ఆయన బ్రాండ్ ఇమేజి మరింత పెరిగింది..ఇక #RRR తర్వాత ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఒక్క సినిమా చెయ్యబోతునాన్ను అని […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 11, 2022 / 04:22 PM IST
    Follow us on

    Rajamouli Mahesh Babu Movie Story: ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో రాజమౌళి సినిమా అంటేనే ఒక్క ప్రభంజనం..ఆయనతో సినిమాలు చెయ్యడానికి పెద్ద పెద్ద సూపర్ స్టార్లు సైతం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు, బాహుబలి తర్వాత ఆయన చేసిన #RRR చిత్రం ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించడంతో ఆయన బ్రాండ్ ఇమేజి మరింత పెరిగింది..ఇక #RRR తర్వాత ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఒక్క సినిమా చెయ్యబోతునాన్ను అని ఇదివరకే అధికారిక ప్రకటన చేసిన సంగతి మన అందరికి తెలిసిందే, ఈ సినిమా వచ్చే ఏడాది లో సెట్స్ పైకి వెళ్లనుంది..మహేష్ బాబు సినిమా అంటే జనాల్లో ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..బాక్స్ ఆఫీస్ పాలిట ఆయన ఒక్క బంగారు బాతు లాంటోడు అని అనడం లో ఎలాంటి సందేహం లేదు, ఎందుకంటే ఆయన యావరేజి సినిమాలు సైతం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామి ని సృష్టిస్తూ ఉంటుంది..అలాంటి మహేష్ బాబు రాజమౌళి వంటి స్టార్ డైరెక్టర్ తో సినిమా చేస్తే ఆ బాక్స్ ఆఫీస్ సునామి ఎలా ఉంటుందో ఊహించడం మన తరం కూడా కాదు..ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన ఒక్క వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది, అదేమిటో ఇప్పుడు మనం చూడబోతున్నాము.

    Rajamouli Mahesh Babu Movie Story

    ఇక అసలు విషయానికి వస్తే చాలా కాలం నుండి మహేష్ – రాజమౌళి కాంబో లో రాబోతున్న సినిమా స్టోరీ ఇదేనంటూ వార్తలు ప్రచారం అవుతున్న సంగతి మన అందరికి తెలిసిందే, ఈ సినిమా ఒక్క ఫారెస్ట్ అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ తో కొనసాగబోతుంది అని, ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో ఇప్పటి వరుకు ఇలాంటి బ్యాక్ డ్రాప్ తో ఒక్క సినిమా కూడా ఇటీవల కాలం లో రాలేదు అని, రాజమౌళి మరోసారి తన అద్భుతమైన విజన్ తో విజువల్ వండర్ గా ఈ సినిమాని తీర్చి దిద్దబోతున్నారు అని ఇలా పలు రకాల వార్తలు చాలా కాలం నుండి ప్రచారం అవుతూనే ఉన్నాయి..ఈ విషయం ని నేరుగా ఇటీవల రాజమౌళి తో జరిగిన ఒక్క ఇంటర్వ్యూ లో యాంకర్ అడగగా ఆయన దానికి సమాధానం చెప్తూ ‘ అవును అండీ..మహేష్ గారితో చెయ్యబోతున్న సినిమా యాక్షన్ అడ్వెంచర్ గా ఉండబోతుంది..ఇప్పటికే రెండు మూడు లైన్లు అనుకున్నాం, దాని మీద పని చేస్తున్నాం.. ఈ ఏడాది లో స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తి చేసి వచ్చే ఏడాది లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది’ అంటూ చెప్పుకొచ్చాడు.

    మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్న సంగతి మన అందరికి తెలిసిందే, ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకి చేరుకుంది..మే 12 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కాబోతుంది..ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయినా రెండు పాటలు మరియు టీజర్ కి అభిమానుల నుండి అడుతమైన రెస్పాన్స్ వచ్చింది,థమన్ అందించిన రెండు పాటలకు యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ ని సొంతం చేసుకుంది..సరిలేరు నీకెవ్వరూ సినిమా తర్వాత సుమారు రెండేళ్ల పాటు మహేష్ బాబు సినిమా విడుదల లేకపోవడం తో అభిమానులందరూ సర్కారువారి పాట సినిమా కోసం ఎంతో ఆకలితో ఎదురు చూస్తున్నారు..వరుసగా మూడు బాక్ బస్టర్స్ కొట్టి మంచి ఊపు మీద ఉన్న మహేష్ బాబు,ఈ సినిమా తో కూడా మరోసారి రికార్డ్స్ తిరగరాయడం ఖాయం అని అభిమానులు బలంగా నమ్ముతున్నారు..మరి వారి అంచనాలను ఈ సినిమా అందుకుంటుందా లేదా అనేది తెలియాలి అంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

    Tags