https://oktelugu.com/

VK Pandian : ఒడిశాలో చర్చంతా కాబోయే ముఖ్యమంత్రి పాండ్యన్ పైనే

ఒడిశాలో చర్చంతా కాబోయే ముఖ్యమంత్రి పాండ్యన్ పైనే.. దీనిపై రామ్ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By:
  • NARESH
  • , Updated On : October 25, 2023 / 06:39 PM IST

    VK Pandian : నవీన్ పట్నాయక్  వరుసగా 5 సార్లు ఒడిషా ముఖ్యమంత్రిగా అప్రతిహతంగా ఓటమి ఎరుగకుండా గెలిచి పాలిస్తున్నారు. మరోసారి నవీన్ నే గెలుస్తాడని.. బిజు జనతాదళ్ దే విజయం అని అన్ని సర్వేలు తేల్చాయి. ఎన్నికలు వచ్చే టైంకి 80 సంవత్సరాలు అవుతుంది. మరో ఐదేళ్లు అంటే 85 ఏళ్లు అవుతుంది. ఇప్పటికే వయోభారంతో ఆయన చేయి ఇలా వణుకుతోంది. సో ఈసారి ఆయన రాజకీయ సన్యాసం తీసుకుందామని యోచిస్తున్నారు.

    నవీన్ పట్నాయక్ పెళ్లి చేసుకోలేదు. బ్రహ్మచారిగా ఉండిపోవడంతో పిల్లలు లేరు. మరి నవీన్ పట్నాయక్ తర్వాత ఎవరు? ఆయన మనసులో ఎవరు ఉన్నారు అన్నదే ప్రశ్న. దీనికి కారణాలు లేకపోలేదు.

    2023 అక్టోబర్ 20వ తారీఖు మాజీ ఐఏఎస్ ఆఫీసర్ మూడు రోజుల్లో వీఆర్ఎస్ అప్లై చేయడం.. నోటీస్ ను ప్రభుత్వం అమలు చేయడం.. కేంద్రం దీన్ని మూడురోజుల్లోనే ఓకే చేసి పంపడం గమనార్హం. ఇదే ఐఏఎస్ ను మూడు కేబినెట్ సంఘాలకు చైర్మన్ గా నవీన్ పట్నాయక్ చేశారు. ఎవరీయన..

    నవీన్ పట్నాయక్ మెచ్చిన ఆ ఐఏఎస్ పేరు కార్తికేయన్ పాండ్యన్. తమిళనాడు వ్యక్తి. మధురైలో చదువుకున్నాడు. ఆ తర్వాత అగ్రికల్చర్ ఫిజియాలజి చేశాడు. 2002 నుంచి కలెక్టర్ గా ఒడిషా క్యాడర్ లో పనిచేస్తున్నాడు. గంజాం కలెక్టర్ గా బాగా పనిచేసిన పాండ్యన్ ను నవీన్ పట్నాయక్ ఏకంగా తన పీఏగా, సీఎంవోలో కీలక అధికారిగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు నవీన్ పట్నాయక్ వారసుడిగా పాండ్యాన్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

    ఒడిశాలో చర్చంతా కాబోయే ముఖ్యమంత్రి పాండ్యన్ పైనే.. దీనిపై రామ్ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.