
Agent First Review: అక్కినేని అఖిల్ కెరీర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ‘ఏజెంట్’. సుమారుగా మూడేళ్ళ క్రితం షూటింగ్ ని ప్రారంభించుకున్న ఈ చిత్రం, కరోనా కారణం గా కొంతకాలం షూటింగ్ పూర్తిగా నిలిచిపోయింది. దానికి తోడు డైరెక్టర్ సురేందర్ రెడ్డి కి కూడా కరోనా చాలా తీవ్ర స్థాయిలో అటాక్ ఇవ్వడం వల్ల షూటింగ్ ఆలస్యం అయ్యింది.అలా ఎన్నో అవరోధాలను ఎదురుకొని ఈ సినిమా ఈ నెల 28 వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ని నిన్న విడుదల చేసారు.దీనికి ఆడియన్స్ మరియు ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈసారి అఖిల్ బాక్స్ ఆఫీస్ పై చాలా గట్టిగానే గురి పెట్టాడని ట్రైలర్ చూస్తేనే అర్థం అయిపోతుంది. అఖిల్ కెరీర్ లోనే ఈ చిత్రం భారీ బడ్జెట్ తో నిర్మించారట. డైరెక్టర్ సురేందర్ రెడ్డి కూడా ఈ చిత్ర నిర్మాణం లో భాగం అయ్యాడు.
కేవలం ఐటెం సాంగ్ మినహా షూటింగ్ కార్యక్రమాలను మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమాకి సంబంధించిన మొదటి కాపీ ని ఇటీవలే నాగార్జున మరియు కొంతమంది సినీ ప్రముఖులకు వేసి చూపించాడట డైరెక్టర్ సురేందర్ రెడ్డి. సినిమా ప్రారంభానికి ముందు అఖిల్ ని ఎలా అయితే చూపిస్తానని మాట ఇచ్చావో,అంతకు మించి గొప్పగా చూపించావని నాగార్జున సురేందర్ రెడ్డి ని పొగడ్తలతో ముంచి ఎత్తాడట.

సినిమా మొత్తం స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉందని, రీసెంట్ టైం లో ఇంత కిక్ ని ఇచ్చిన సినిమా చూడలేదని ఈ ప్రివ్యూ షో ని చూసిన వాళ్ళు చెప్తున్నారట. ఆడియన్స్ నుండి కూడా అదే స్థాయి రెస్పాన్స్ వస్తే, అఖిల్ తన కెరీర్ లో ఎప్పటి నుండో కోరుకుంటున్న గ్రాండ్ హిట్ తగిలినట్టే అని అంటున్నారు విశ్లేషకులు. చూడాలి మరి అక్కినేని వారసుడు ఈసారి బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ కొడతాడా లేదా అనేది.