Krishnam Raju- AIG Hospital Report: రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇక లేరు.. హైదరాబాద్ లో ఈ రోజు తెల్లవారుజామున 3.25 నిమిషాలకు కన్నుమూశారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు. ఆయన వయస్సు 83 సంవత్సరాలు. బీజేపీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కృష్ణంరాజు పనిచేశారు. ఏపీ నుంచి ఎంపీగా గెలిచారు.

గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరమవదించారు. రేపు ఉదయం హైదరాబాద్ లో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. 1940 జనవరి 20న పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు జన్మించారు. కృష్ణంరాజుకు భార్య శ్యామలా దేవి, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
కృష్ణం రాజు 83 ఏళ్ల వయసులో మరణించాడు. ఆయన వృద్ధాప్యంతో బాధపడుతున్నారు. కృష్ణంరాజుకు డయాబెటిస్ (షుగర్) వ్యాధి ఉంది. కరోనరీ హార్ట్ డిసీజ్, క్రానిక్ హార్ట్ రిథమ్ డిజార్డర్, హార్ట్ డిస్ఫంక్షన్తో పోస్ట్ కార్డియాక్ స్టెంటింగ్ వంటి గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారని ఆయనకు చికిత్స అందించిన ఏఐజీ ఆస్పత్రి ఒక ప్రకటనలో తెలిపింది. గత సంవత్సరం బాత్రూంలో కాలుజారి పడిపోవడంతో పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ కారణంగా కాలుకి శస్త్రచికిత్స చేయించుకున్నాడు.
ఇక కృష్ణంరాజుకు దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి- నెబ్యులైజ్డ్ ఇన్హేలర్లపై క్రానిక్ బ్రోన్కైటిస్ ఉన్నాయని వైద్యులు ఆయన మరణానికి కారణాలపై ప్రకటన విడుదల చేశారు.

కృష్ణంరాజు ఆగస్టు 5న కోవిడ్ తర్వాత ఎఫెక్ట్ అయిన సమస్యల వల్ల ఆస్పత్రిలో చేరాడు. మల్టీడ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్ తో తీవ్రమైన న్యుమోనియా, తీవ్రమైన ఇన్ఫెక్టివ్ బ్రోన్కైటిస్తో బాధపడుతున్నాడు. ఆసుపత్రిలో ఉన్న సమయంలో గుండె కొట్టుకోవడంలో ఆటంకాలు ఏర్పడ్డాయి. మూత్రపిండాల పనితీరు మరింత దిగజారింది. అడ్మిట్ అయినప్పటి నుంచి ఆయన వెంటిలేటర్ సపోర్టుతో చికిత్స పొందుతున్నారు.
పల్మోనాలజీ, క్రిటికల్ కేర్, కార్డియాలజీ, నెఫ్రాలజీ, ఇన్ఫెక్షియస్ డిసీజెస్, వాస్కులర్ సర్జరీ విభాగాల నుండి నిపుణుల బృందం కృష్ణంరాజుకు చికిత్స అందించినా వయోభారం కావడం వల్ల ఆయన శరీరం స్పందించలేదు. ఈరోజు తెల్లవారుజామున తీవ్రమైన న్యుమోనియా, దాని సమస్యలతో మరణించాడు. ఆ సమయంలో గుండెపోటు రావడంతో తెల్లవారుజామున 3.16 గంటలకు తుదిశ్వాస విడిచాడు.
Also Read:Krishnam Raju Passed Away: రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూత