BJP AIADMK Alliance : తమిళనాడు రాజకీయాల్లో ఒక ఆసక్తికర పరిణామం జరిగింది. అన్నాడీఎంకే , బీజేపీ పొత్తు లేదని అనిపిస్తోంది. ఇది జరిగేటట్టు కనిపించడం లేదు. నిన్న సీఐఐ అమలు చేస్తామని యూనియన్ మినిస్టర్ శాంతన్ ఠాకూర్ ప్రకటించారు. తమిళనాడు సీఎం స్టాలిన్ మాత్రం తమ రాష్ట్రంలో అమలు చేయమని ప్రకటించారు. బెంగాల్ సీఎం మమతా కూడా అదే పని చేసింది.
కానీ అన్నాడీఎంకే అధినేత ఫళని స్వామి ఒక ప్రకటన చేశారు. మైనార్టీలు దెబ్బతినే పని ఏదీ చేయనని.. మైనార్టీలకు అనుగుణంగానే పనిచేస్తామని ప్రకటించారు. తమిళనాడులో ఎంపీ సీట్ల కోసం అన్నాడీఎంకేతో పొత్తు కోసం ప్రయత్నిస్తోంది. కానీ ఫళని స్వామి మాత్రం బీజేపీ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటూ మైనార్టీల కోసం పాటుపడుతున్నారు. బీజేపీ వ్యతిరేక శక్తులతో కలుస్తున్నారు. బీజేపీ సీఐఐకి వ్యతిరేకంగా ఈరోజు మాట్లాడారు.
దీన్ని బట్టి తమిళనాడులో బీజేపీకి మంచి రోజులు రాబోతున్నాయి.. అన్నాడీఎంకే తో పొత్తు లేనట్లేనని అర్థమవుతోంది. ఇదే జరిగితే బీజేపీపై తమిళనాడులో పాలుపోసినట్టే.. అన్నామలైను హీరోను చేసినట్టే.. సర్వేలు ఇదే చెబుతున్నాయి..
తమిళనాడులో బీజేపీ, అన్నాడీఎంకే పొత్తుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.