Tamil Nadu Politics : తమిళనాడు రాజకీయాల్లో అన్నామలై ఓ పెద్ద సంచలనం. ఐపీఎస్ ఆఫీసర్ గా కర్ణాటకలో క్రేజ్. రాజకీయ వేత్తగా తమిళనాడులో అంతకన్నా ఎక్కువ క్రేజ్. అన్నామలై తమిళనాడు రాజకీయాలను ఓ కుదుపు కుదుపుతున్నాడు. తన సొంత పార్టీ తట్టుకోలేక కొందరు బయటకెళ్లారు. ఇప్పుడు మిత్రపక్షమైన అన్నాడీఎంకే కూడా బీజేపీ కూటమి నుంచి బయటకు వెళ్లింది. దీంతో తమిళనాడు రాజకీయం రసకందాయంలో పడింది. 2014 సీన్ తమిళనాడులో రిపీట్ కాబోతోందా?
2014లో మూడు కూటములు పోటీ చేశాయి. జయలలిత అన్నాడీఎంకే ఒంటరిగా పోటీ చేసింది. డీఎంకే కూటమిగా పోటీచేసింది. ఎన్డీఏలోని బీజేపీ , డీఎండీకేతో కలిసి పోటీచేసింది. ఈ మూడు ఫ్రంట్ లుగా పోటీచేసినప్పుడు అన్నాడీఎంకేకు 37 సీట్లు, ఎన్డీఏకు 2 సీట్లు, డీఎంకేకు ఒక్క సీటు కూడా రాలేదు.
2019కి వచ్చేసరికి యూపీఏ కూటమి, మరో కూటమి ఎన్డీఏ కూటమిగా రెండే పోటీచేశాయి. ఎన్డీఏలో ఎన్నో పార్టీలను కలిపి పోటీచేయించాయి. అదే అన్నాడీఎంకే కూడా జయలలిత మరణం తర్వాత బీజేపీ కూటమిలోకి వచ్చింది. కానీ 2019లో మొత్తం డీఎంకేకే ఎంపీ సీట్లు వచ్చాయి.
ఇప్పుడు 2024లో ఏం జరుగబోతోందన్నది ఆసక్తి రేపుతోంది. అన్నాడీఎంకే బీజేపీతో తెగదెంపులు, తమిళనాడు లో ఏం జరగబోతోంది? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.