Chandrababu Bail : మనవడు దేవాన్ష్ ను పట్టుకొని ఏడ్చేసిన చంద్రబాబు… ఓదార్చిన బాలకృష్ణ.. ఫోటోలు వైరల్

స్వాగతం పలికేందుకు వెళ్లిన బాలకృష్ణ బావ కాలికి నమస్కరించడం విశేషం. ప్రస్తుతం ఈ దృశ్యాలు సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Written By: NARESH, Updated On : October 31, 2023 6:11 pm
Follow us on

Chandrababu Bail : చంద్రబాబు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అవినీతి కేసులో చంద్రబాబు అరెస్టై.. దాదాపు 53 రోజులపాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. హైకోర్టు ఈరోజు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలయ్యారు. కుటుంబ సభ్యులతో పాటు పార్టీ నేతలు సాదరంగా స్వాగతం పలికారు. వివిధ ప్రాంతాల నుంచి టీడీపీ శ్రేణులు భారీగా తరలి రావడంతో జైలు ప్రాంగణం ఇసుకేస్తే  రాలనంతగా మారిపోయింది.
 సుమారు 50 రోజుల అనంతరం కుటుంబ సభ్యులను చూడడంతో చంద్రబాబు ఓకింత ఉద్వేగానికి గురయ్యారు. ప్రధానంగా మనవడు దేవాన్ష్ ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. గుండెలకు హత్తుకున్నారు. ఈ దృశ్యాన్ని చూసిన పార్టీ శ్రేణులు ఆవేదనకు గురయ్యారు. చంద్రబాబు అరెస్ట్, జైలు విషయమై మనుమడు దేవాన్స్ కు చెప్పలేదని ఇటీవల నారా భువనేశ్వరి చెప్పిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో తాత బాలకృష్ణ, తల్లి బ్రాహ్మణితో మంగళవారం సాయంత్రం రాజమండ్రి చేరుకున్న దేవాన్ష్ తాత చంద్రబాబును చూసి మురిసిపోయారు. అటు చంద్రబాబు సైతం మనవడిని చూసి  ఆనందించారు. హత్తుకున్నారు. ప్రస్తుతం టిడిపి సోషల్ మీడియాలో  ఈ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.
 మరోవైపు నందమూరి బాలకృష్ణ చంద్రబాబుకు స్వాగతం పలికారు. బావ కాలికి నమస్కరించడం టిడిపి శ్రేణులకు ఆకట్టుకుంది. బాలకృష్ణ చంద్రబాబుకు బావమరిదే కాదు. వియ్యంకుడు కూడా. ఆది నుంచి చంద్రబాబుతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఎప్పుడు విభేదించిన దాఖలాలు లేవు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత  బాలకృష్ణ వేగంగా స్పందించారు. సినిమా షూటింగులు నిలిపివేసి మరి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించారు. చాలా సందర్భాల్లో బాధపడ్డారు కూడా. ఎట్టకేలకు చంద్రబాబుకు బెయిల్ లభించడంతో.. స్వాగతం పలికేందుకు వెళ్లిన బాలకృష్ణ బావ కాలికి నమస్కరించడం విశేషం. ప్రస్తుతం ఈ దృశ్యాలు సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.