ఈ వ్యక్తి వయస్సు 83 సంవత్సరాలు.. 68 ఏళ్లుగా జైలులోనే..?

సాధారణంగా ఒక వ్యక్తి ఎంత పెద్ద తప్పు చేసినా మన దేశంలో 14 సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తారు. చాలామంది జైలు జీవితం అంటే భయపడతారు. జైలుకు వెళితే బయటి ప్రపంచంతో ఎటువంటి సంబంధం లేకుండా జీవనం సాగించాలి. జైలు జీవితం అంటే నిత్య జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఒక వ్యక్తి మాత్రం 68 సంవత్సరాల నుంచి జైలు జీవితం గడుపుతున్నాడు. 68 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించిన ఆ వ్యక్తి పేరు […]

Written By: Navya, Updated On : February 21, 2021 7:10 pm
Follow us on

సాధారణంగా ఒక వ్యక్తి ఎంత పెద్ద తప్పు చేసినా మన దేశంలో 14 సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తారు. చాలామంది జైలు జీవితం అంటే భయపడతారు. జైలుకు వెళితే బయటి ప్రపంచంతో ఎటువంటి సంబంధం లేకుండా జీవనం సాగించాలి. జైలు జీవితం అంటే నిత్య జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఒక వ్యక్తి మాత్రం 68 సంవత్సరాల నుంచి జైలు జీవితం గడుపుతున్నాడు.

68 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించిన ఆ వ్యక్తి పేరు జోసెఫ్ లిగోస్. 1953 సంవత్సరంలో దోపిడీ, హత్య కేసులో జోసెఫ్ జైలుకు వెళ్లాడు. అరెస్ట్ అయిన సమయంలో జోసెఫ్ వయస్సు కేవలం 15 సంవత్సరాలు కావడం గమనార్హం. ఫిలడెల్ఫీయా కోర్టు జోసెఫ్ కు యావజ్జీవ కారాగార శిక్షను విధించింది. అప్పుడు జైలుకు వెళ్లిన జోసెఫ్ ఇప్పుడు విడుదలయ్యాడు. మధ్యలో జైలు నుంచి బయటకు రావడానికి అవకాశాలు వచ్చినా జోసెఫ్ వాటిని వినియోగించుకోలేదు.

ఇలా 68 సంవత్సరాలు జైలుకే పరిమితం కావడంతో అత్యంత ఎక్కువకాలం జైలు శిక్ష అనుభవించిన వ్యక్తిగా జోసెఫ్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. గతంలో రెండుమూడుసార్లు బయటకు వెళ్లే అవకాశం వచ్చినా బయటకు వెళ్లని జోసెఫ్ జాన్ పేస్ అనే సహచర ఖైదీతో ఎక్కువగా స్నేహం చేశారు. సాధారణంగా జైలు జీవితం అందరికీ విరక్తిని కలిగిస్తే జోసెఫ్ మాత్రం జైలుకే 68 సంవత్సరాలు పరిమితం కావడం గమనార్హం.

జోసెఫ్ లిగోస్ అనుభవించిన జైలు శిక్ష గురించి తెలిసి నెటిజన్లు సైతం అవాక్కవుతున్నారు. బయటకు రాకుండా, బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా జోసెఫ్ లిగోస్ జైలు జీవనం గడపడం గమనార్హం.