Aditya-L1 Solar Mission: చంద్రుడైపోయాడు.. ఇక సూర్యుడి వంతు.. ఇస్రో అస్త్రం ‘ఆదిత్య ఎల్1’

సూర్యుడిపై దాగివున్న ఎన్నో రహస్యాలను చేదించేందుకు గత కొన్ని దశాబ్దాలుగా ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. ఇందుకోసం వివిధ దేశాలు ప్రయత్నించాయి.

Written By: Dharma, Updated On : September 2, 2023 10:55 am

Aditya-L1 Solar Mission

Follow us on

Aditya-L1 Solar Mission: ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమవుతోంది. చంద్రయాన్ 3 స్ఫూర్తితో ఆదిత్య ఎల్ వన్ ప్రయోగానికి సన్నాహాలు పూర్తి చేసింది. ఇప్పటివరకు చంద్రుడు పై రహస్యాలను తెలుసుకునేందుకు చంద్రయాన్ 3 ప్రయోగించిన సంగతి తెలిసిందే. మరోవైపు సూర్యుడు రహస్యాలు ఛేదించేందుకు తాజా ప్రయోగానికి తెర తీయనుంది. శ్రీహరికోట లో ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి మరికొద్ది గంటల్లో ఈ ప్రయోగాన్ని చేపట్టనుంది. ఇదే గానీ విజయవంతమైతే ప్రపంచ దేశాల్లో భారత్ సూపర్ పవర్ కావడం ఖాయం.

సూర్యుడిపై దాగివున్న ఎన్నో రహస్యాలను చేదించేందుకు గత కొన్ని దశాబ్దాలుగా ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. ఇందుకోసం వివిధ దేశాలు ప్రయత్నించాయి. సోలార్ మిషన్లను ప్రయోగిస్తూనే ఉన్నాయి. వాటిలో కొన్ని విజయవంతమయ్యాయి. మరికొన్ని ఫెయిల్ అయ్యాయి కూడా. అయితే చంద్రుడు పై కాలు మోపిన ఊపులో ఉన్న ఇస్రో… ఈసారి అదే ఊపులో సూర్యుడిపైన అడుగుపెట్టి ప్రపంచానికి తానేంటో చూపించాలని గట్టి పట్టుదలతో ఉంది. ఆదిత్య ఎల్ వన్ ప్రయోగంపై నమ్మకంతో ఉంది. అటు ప్రపంచ దేశాలు సైతం ఆసక్తిగా గమనిస్తూ ఉన్నాయి.

వాస్తవానికి సూర్యుడిపై అతికొద్ది దేశాలే అధ్యయనం చేస్తున్నాయి. ఇప్పుడు కానీ ఆదిత్య యల్ వన్ ప్రయోగం విజయవంతం అయితే భారత్ ఎన్నో మైలురాళ్లను అధిగమించినట్టవుతుంది. ఇప్పటికే చైనా కి చెందిన రెండు అంతరిక్ష నౌకలు ప్రస్తుతం భూమి కక్షలో కలిగి ఉన్నాయి. జపాన్, యూకే, యూఎస్, యూరప్ అంతరిక్ష ఏజెన్సీల మద్దతుతో హినోడ్ అనే నౌక భూమిని పరిభ్రమిస్తోంది. సూర్యుని అయస్కాంత క్షేత్రాలను కొలుస్తోంది. అటు అమెరికాలోని పార్కర్ సోలార్ ప్రోబ్ తో సహా ఇతర సౌర మిషన్ల సైతం యాక్టివ్ గా పని చేస్తున్నాయి.గతంలో కూడా ఈ దేశాల్లో కొన్ని అధ్యయనాల్లో ముందడుగు వేశాయి. ఇప్పుడు గాని ఆదిత్య ఎల్ వన్ విజయవంతం అయితే వాటి సరసన భారత్ చేరే అరుదైన అవకాశం దక్కించుకోనుంది.