https://oktelugu.com/

Vijayendra Prasad: విజయేంద్ర ప్రసాద్ కి పూరి జగన్నాథ్ అంటే ఎందుకంత ఇష్టం… లైగర్ ప్లాప్ తర్వాత ఏం జరిగింది…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది దర్శకులు ఉన్నప్పటికీ పూరి జగన్నాథ్ కి చాలా ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుందనే చెప్పాలి. ఎంత పెద్ద స్టార్ హీరోతో అయిన సరే మూడు నెలల్లో సినిమాలు తీసే కెపాసిటీ పూరి ఒక్కడికే ఉందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు...

Written By:
  • Gopi
  • , Updated On : August 12, 2024 / 10:08 AM IST

    Vijayendra Prasad

    Follow us on

    Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో గట్స్ ఉన్న డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది పూరి జగన్నాథ్ అనే చెప్పాలి. బద్రి సినిమా నుంచి ఆయన చేస్తున్న ప్రతి సినిమా కూడా కమర్షియల్ గా సక్సెస్ అవ్వడానికి ఆయన చాలా రకాలుగా ప్రయత్నం చేస్తూ వరుస సినిమాలు చేస్తూ భారీ సక్సెస్ లను అందుకుంటున్నాడు. ఇక అందులో భాగంగానే 2019లో చేసిన ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా ఇప్పుడు ‘డబుల్ ఇస్మార్ట్’ అనే సినిమా చేశాడు. అయితే ఈ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిన్న నిర్వహించిన విషయం మనకు తెలిసిందే. అయితే అందులో పూరి జగన్నాథ్ మాట్లాడుతూ తన గత సినిమాలు అయిన లైగర్ ఫ్లాప్ అయిందని అందుకే ఈ సినిమా మీద ఎక్కువ ఫోకస్ చేసి మరి తీశానని తప్పకుండా ఈ సినిమా సక్సెస్ అవుతుందని చెప్పాడు. ఇక దాంతో పాటుగా లైగర్ సినిమా ఫ్లాప్ అయిన వరం రోజులకి ఇండియాలోనే టాప్ రైటర్ ఆయన విజయేంద్రప్రసాద్ పూరి జగన్నాథ్ కి ఫోన్ చేసి మీ నుంచి నాకు ఒక హెల్ప్ కావాలని అడిగారట. దానికి పూరి కూడా ఏంటో చెప్పండి అని సమాధానం ఇచ్చారట. ఇక అప్పుడు విజయేంద్రప్రసాద్ మీరు ఏదైనా సినిమా చేసే ముందు కథని ఒక్కసారి నాకు చెప్పండి.

    అందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే నేను చెబుతాను..ఎందుకంటే మీరంటే నాకు చాలా ఇష్టం.. మీలాంటి టాప్ డైరెక్టర్లు కథల విషయంలో చిన్న చిన్న మిస్టేక్ లు చేయడం నాకు నచ్చడం లేదు అంటూ పూరి జగన్నాథ్ మీద తన అభిమానాన్ని చాటుకున్నాడట. ఇక దానికి పూరి చాలావరకు ఎమోషనల్ అయ్యారట. ఆయన చెప్పిన విధంగానే ఈసారి కథలో ఏ మిస్టేక్స్ చేయకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని సినిమా చేశానని ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులందరిని అలరిస్తుందని ఆయన చాలా కాన్ఫిడెంట్ గా చెబుతున్నాడు…

    ఇక మొత్తానికైతే ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్న డబుల్ ఇస్మార్ట్ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుంది అనేది తెలియాలంటే రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక మొత్తానికైతే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తో ఒక్కసారిగా ఈ సినిమా మీద అంచనాలను తారా స్థాయిలో పెంచేసారనే చెప్పాలి…

    ఇక కొద్దిరోజుల క్రితం రిలీజ్ అయిన ట్రైలర్ ని కనక చూసినట్లయితే అందులో రామ్ తన ఎనర్జీతో సినిమా మొత్తాన్ని తను ఒక్కడే హ్యాండిల్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఇక ఈ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకుంటే రామ్ తన కెరీయర్ లో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని కొడతాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…