Actor Vishal Wedding: విశాల్ తెలుగు బిడ్డగా తమిళ కథానాయకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకతను సాధించుకున్నాడు. తన సినిమాల విషయంలో విశాల్ ఎంత ఖచ్చితత్వంతో ఉంటాడో.. బయట అంత కూల్ గా కనిపిస్తాడు. సినిమా కుటుంబంలో పుట్టినా.. విప్లవ భావాలతోనే విశాల్ సినీ ప్రయాణం మొదలైంది. హీరోగా నిర్మాతగా తమిళనాట విశాల్ సాలిడ్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇటు తెలుగు నేల పైనా విభిన్నమైన హీరోగా విశాల్ కి గుర్తింపు ఉంది. విశాల్ కథల్లో డొంక తిరుగుడు ఉండదు, ముక్కుసూటిగా మాట్లాడటం విశాల్ నైజం. ఆ విలక్షణమే ఆయనను స్టార్ ను చేసింది.

విశాల్ ను తమిళ ప్రేక్షకులు ‘చిన్న నాయకుడు’ అంటూ ముద్దుగా పిలుచుకుంటారు అంటే కారణం.. విశాల్ హీరో అని కాదు, ఒక తిరుగుబాటు దారుడు అని. పేద కళాకారుల పెన్నిధి అని. అలాంటి విశాల్ పెళ్లి ఎప్పుడు ? గత పదేళ్ల నుంచి ఇది హాట్ టాపిక్ గానే ఉంది. విశాల్ కి ప్రస్తుతం 44 ఏళ్ళు, అయినా పెళ్లి చేసుకునే మూడ్ లో లేడు. ఆ మధ్య హైదరాబాద్ కి చెందిన అనిషా రెడ్డి అనే నటితో (అర్జున్ రెడ్డి ఫేమ్) విశాల్ కి నిశ్చితార్థం ఘనంగా జరిగింది.
Also Read: Vijay Deverakonda- Rashmika Mandanna: రష్మిక కోసం పూజా హెగ్డేకి హ్యాండ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ
పెళ్లి ముహుర్తాలు ఫిక్స్ అయ్యే టైంలో ఏమైందో ఏమో గానీ విశాల్, అనిషాకి బ్రేకప్ చెప్పేశాడు. ఆ తర్వాత మళ్ళీ ఆర్నెల్ల తర్వాత ఇద్దరూ కలిసారని, త్వరలోనే పెళ్లి ఉంటుంది అంటూ వార్తలు వచ్చాయి. కానీ వాళ్ళు కలవలేదు. మరోపక్క అనీషాతో బంధం గురించి ఇన్నాళ్లు విశాల్ ఎక్కడా క్లారిటీ ఇవ్వలేదు. అయితే.. తాజాగా తన పెళ్లి గురించి విశాల్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విశాల్ మాట్లాడుతూ.. ‘నేను ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్నాను. త్వరలోనే ఆమె గురించి పూర్తి వివరాలు చెబుతాను. అప్పటివరకు ఆమె గురించి నన్ను అడగొద్దు’ అంటూ ఆమె ఎవరో చెప్పకుండా విశాల్ మాట దాటేశాడు. కానీ విశాల్ ప్రేమించిన అమ్మాయి.. ఓ తమిళ సింగర్ అని తెలుస్తోంది.

ఐతే.. ఇక్కడ విశాల్ చేసిన మరో కామెంట్ కూడా వైరల్ అవుతుంది. పెద్దలు కుదిర్చిన సంబంధాలు.. కలిసి రాకపోవడం కారణంగానే.. ప్రేమ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు విశాల్ చెప్పడం విశేషం. ఇంతకీ అనిషా రెడ్డి పరిస్థితి ఏమిటి విశాల్ ? అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఇక మరోపక్క నడిగర్ సంఘానికి భవనం కట్టించాకే తాను పెళ్లి చేసుకుంటానని విశాల్ శపథం చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ భవనం పూర్తయ్యాక.. తన ప్రేయసి ఎవరనేది చెప్పే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read:Chiranjeevi Movie: 50 లక్షలతో తీసిన ఈ సినిమా అప్పట్లో ఎంత వసూలు చేసిందో తెలుసా?
[…] Also Read: Actor Vishal Wedding: త్వరలోనే విశాల్ ప్రేమ పెళ్లి… […]