https://oktelugu.com/

విశాఖ స్టీల్ ఆందోళన.. పరిష్కార మార్గాలేంటి?

ఆంధ్రుల హక్కు గా ఉన్నవిశాఖ స్టీల్ ప్లాంట్ పై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన రాజుకుంటోంది. రోజురోజుకు ఆందోళనలు ఉధృతం కావడంతో రాజకీయ పార్టీలన్నీ ఒక్కతాటిపైకి వస్తున్నాయి. ఉక్కు కర్మగారాన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి పంపే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకునేవరకు ఉద్యమం ఆపేది లేదని కార్మిక సంఘాలతో పాటు రాజకీయ పార్టీలు ముక్తకంఠంతో పోరాడుతున్నాయి. ఇప్పటికే అధికార వైసీపీకి చెందిన ఎంపీ ఎంవీవీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు.ఈ నేపథ్యంలో విశాఖ […]

Written By:
  • NARESH
  • , Updated On : February 9, 2021 10:52 am
    Follow us on

    ఆంధ్రుల హక్కు గా ఉన్నవిశాఖ స్టీల్ ప్లాంట్ పై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన రాజుకుంటోంది. రోజురోజుకు ఆందోళనలు ఉధృతం కావడంతో రాజకీయ పార్టీలన్నీ ఒక్కతాటిపైకి వస్తున్నాయి. ఉక్కు కర్మగారాన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి పంపే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకునేవరకు ఉద్యమం ఆపేది లేదని కార్మిక సంఘాలతో పాటు రాజకీయ పార్టీలు ముక్తకంఠంతో పోరాడుతున్నాయి. ఇప్పటికే అధికార వైసీపీకి చెందిన ఎంపీ ఎంవీవీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు.ఈ నేపథ్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా నష్టనివారణకు కొన్ని మార్గాలున్నాయని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో చూద్దాం..

    విశాఖ స్టీల్ ప్లాంట్ కొన్ని సంవత్సరాలుగా నష్టాల బాట పడుతుందని, అందుకే ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కూడా ప్రస్తావించింది. అయితే స్టీల్ ప్లాంట్లో నష్టాలు రావడానికి సొంత ఉక్కు గనులు లేకపోవడమే. ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్ (వైఎస్పీ) ముడి ఖనిజం కోసం ఎన్ఎండీసీకి చెందిన బైలదిలా పై ఆధారపడుతోంది. ఈ గనుల నుంచి మెట్రిక్ టన్ను రూ.5260 చొప్పున కొనుగోలు చేస్తోంది. దేశంలోని ఇతర స్టీల్ ప్లాంట్లన్నీ 60 శాతం సొంతగా గనులను ఏర్పాటు చేసుకొని మిగిలిన 40 శాతం మాత్రమే ఎన్ఎండీసీ నుంచి కొనుగోలు చేస్తున్నాయి.

    ఈ నేపథ్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ కు సొంతంగా గనులు కేటాయిస్తే నష్ట నివారణ చేపట్టవచ్చంటున్నారు. 1980లో ప్రారంభమైన ఉక్క ఉత్పత్తి 1991లో పూర్తి స్థాయిలో పనిచేయసాగింది. ప్రారంభంలో కొంత నష్టాలను ఎదుర్కొన్నా.. 2001 తరువాత ఆధునీకరించిన తరువాత లాభాల బాటలో కొనసాగింది. 2002-2003 ఆర్థిక సంవత్సరంలో మెట్ట మొదటి సారిగా రూ.522 కోట్లు లాభం వచ్చింది. 2004-2005లో కర్మాగారాన్ని మరింత విస్తరించారు. విస్తరణ తరువాత పూర్తిస్థాయిలో ఉత్పత్తి జరిగి 6.3 మిలియన్ టన్నుల కెపాసిటీకి ఎదిగింది.

    కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఒక కర్మగారం నష్టం వస్తే అందుకు ప్రభుత్వమే భరించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతుంది.మరోవైపు నీతి అయోగ్ చెప్పిన ఆధారంగా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడితె ఎలా అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ప్లాంట్ కు ఉన్న మిగులు భూములను లీజుకు ఇచ్చి నష్టాల తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు. దుర్గాపూర్ స్టీల్ తరహాలో డిజిన్వెస్ట్మెంట్ కు వెళ్లొచ్చని అంటున్నారు.అయితే సొంతంగా గనులు లేని వీఎస్పీ గత ఏడాది రూ.200 కోట్ల లాభాలు ఆర్జించింది. ప్లాంట్ ను ఆదుకోవడానికి ఇన్ని ప్రత్యామ్నాయ మార్గాలుండగా ప్రైవేటీకరణ చేయడం ఎంతమాత్రం తగదని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

    ఇక ఉక్క కర్మాగారం ఆధ్వర్యంలో 6వేల ఎకరాల భూములున్నాయి. ప్లాంట్, టౌన్ షిప్ పోనూ మిగతా భూములను విక్రయించడం ద్వారా స్టీల్ ప్లాంట్ కు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఇందుకు రాష్ట్రప్రభుత్వం కూడా అనుమతి ఇస్తుందని ఇదివరకే జగన్ ప్రకటించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ నష్ట నివారణకు ఇన్ని ప్రత్యామ్నాయ మార్గలుండగా ప్రైవేటీకరణ చేయొద్దని డిమాండ్ చేస్తున్నారు.