https://oktelugu.com/

G-20 summit 2023 : భారత్- మధ్య ఆసియా – యూరోప్ ఆర్థిక నడవా ఓ పెద్ద గేమ్ చేంజర్

భారత్, పశ్చిమాసియా, యూరప్ మధ్య ఆర్థిక ఏకీకరణకు ఈ కారిడార్ నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది.

Written By:
  • NARESH
  • , Updated On : September 11, 2023 / 04:46 PM IST

    G-20 summit 2023 : జీ20 సమావేశాల చరిత్రలోనే ఇన్ని నిర్ధిష్ట ఫలితాలు సాధించిన సమావేశం మరొకటి లేదు. అద్భుత రికార్డ్ ఇదీ. దీన్ని విజయవంతం చేసిన ఘనత మాత్రం ఖచ్చితంగా ప్రధాని మోడీదే అనడంలో ఎలాంటి సందేహం లేదు. శశిథరూర్ కూడా జీ20 సమావేశాలను దెప్పిపొడిచాడు. షో టప్ అన్నాడు. ఇంత పకడ్బందీగా నిర్వహించినందుకు మోడీని అందరూ పొగుడుతుంటే కాంగ్రెస్ మాత్రం జీర్ణించుకోవడం లేదు. వీరిని ఏమనాలి.. నిజంగా ఈ సమావేశాల ఫలితాలు భారత్ పై ప్రపంచం ఉంచిన భరోసాగా చెప్పొచ్చు.

    ప్రపంచంలో రెండు కూటములు రెండు విధాలుగా ఉన్నాయి. రెండో చైనా, రష్యా డామినేటెడ్ కూటమి. జీ7 ప్రాశ్చాత్య కూటమి. క్వాడ్ కాకుండా బ్రిక్స్, చైనా సపరేట్ కూటములు షాంఘై లాంటివి పెట్టుకున్నారు. చైనా కూటముల్లోనూ భారత్ ఉంది. రెండూ కూటములకు సభ్యురాలిగా ఉన్న దేశం భారత్. అదే మనకు ఉపయోగపడింది. న్యూఢిల్లీ లీడర్ షిప్ సమ్మిట్ డిక్లరేషన్ జరిగింది. ఈసారి కష్టం డిక్లరేషన్ జరగడం సాధ్యం కాదు అనుకున్నారు. పోయిన సారి బాలిలో రష్యా వ్యతిరేకించింది. కానీ మోడీ మాత్రం దీన్ని సక్సెస్ చేసి నిరూపించారు. ఈసారి ఎలాంటి అభ్యంతరాలు లేకుండా 83 పేజీల తీర్మానాన్ని 20 దేశాలు ఏకగ్రీవంగా ఆమోదించడం విశేషం.

    భారత్, పశ్చిమాసియా, యూరప్ మధ్య ఆర్థిక ఏకీకరణకు ఈ కారిడార్ నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. మానవ నాగరికత అభివృద్ధికి మౌలిక సదుపాయాలే బలమైన పునాదులు. సరిగ్గా వీటినే తమకు అనుకూలంగా మార్చుకోవాలని జి_20 లోని ప్రభావవంత దేశాలు భావిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఈ కారిడార్ నిర్మాణానికి ముందుకు వచ్చాయి. వాస్తవానికి మౌలిక వసతులు మెరుగుపడితేనే సుస్థిర అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచంలోని పలు పరిణామాలు ఇదే విషయాన్ని వెల్లడించాయి. అందుకే సభలు ప్రారంభమైన మొదటి రోజే కారిడార్ విషయం చర్చకు వచ్చింది. అయితే చాలామంది ఇది చర్చల దశలోనే ముగిసిపోతుంది అనుకున్నారు. అయితే పలు దేశాలు దీనిపై ముందుకే అడుగులు వేయడంతో అతి త్వరలో నిర్మాణం జరుగుతుందని సంకేతాలు కనిపిస్తున్నాయి. దీని ఆధారంగానే ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థలు పురుడు పోసుకుంటాయని భారత్, గల్ఫ్, యూరప్ భావిస్తున్నాయి.

    భారత్- మధ్య ఆసియా – యూరోప్ ఆర్థిక నడవా ఓ పెద్ద గేమ్ చేంజర్ పై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.