Husband And Wife Relationship: ‘కంటే కూతుర్నే కనాలి’ అంటారు. కానీ కూతుర్ని కనగానే సరిపోదు. జీవితాంతం ఆమెను కంటికి రెప్పలా కాపాడుకోవాలి అని కొందరు పెద్దలు చెబుతుంటారు. దీంతో కొందరు కూతురు పై అమితంగా ప్రేమ ఉంచుతారు. వారు అడిగినవన్నీ ఇస్తారు. అయితే పెళ్లయ్యే వరకు కూతుర్ని బాగా చూసుకోవాలి. కానీ పెళ్లయిన తరువాత వేరొకరి భార్య. అంటే తనకంటూ ప్రత్యేకంగా ఓ కుటుంబం ఏర్పరుచుకుంటారు. ఇలాంటి సమయంలో కూతురు పై ప్రేమ ఉండాలి. కానీ వారి సంసారంలో చిచ్చు పెట్టే విధంగా తల్లిదండ్రులు నడుచుకోవద్దు. కొన్ని విషయాల్లో కూతురిపై ఉన్న ప్రేమతో తల్లులు చెప్పకూడని, చేయకూడని పనులు చేస్తారు. ఇలా చేయడం వల్ల తమ కూతురి జీవితం నాశనం అవుతుంది అని మాత్రం గ్రహించరు. ఇంతకీ కూతురు కు తల్లి ఎలాంటి విషయాలు చెప్పడం వల్ల సంసారంలో చిచ్చు పుడుతుంది?
పెళ్లయిన తరువాత ప్రతీ మహిళకు బాధ్యత ఉంటుంది. తన కుటుంబాన్ని చక్కదిద్దుకోవాలని అన్న ఆలోచన ఉంటుంది. ఈ క్రమంలో వారు ఎదుటివారి మీద ఆధారపడకుండా బాధ్యతలు నిర్వర్తించే విధంగా చూసుకోవాలి. తెలియకుండానో.. తెలిసో.. కొన్ని తప్పులు చేయొచ్చు. అయితే తెలియని విషయాలను తల్లి దగ్గర నేర్చుకోవచ్చు. కానీ తమ కూతురుకు ఏమి తెలియదు అనుకొని ప్రతీ సారి ఫోన్ చేసి.. ప్రతీ విషయాన్ని చెప్పడం వల్ల కూతురు తల్లి లేకుండా ఏ పని చేయలేదు. దీంతో కొన్ని విషయాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి.
పెళ్లయిన తరువాత కూతురు ఎక్కడున్నా సంతోషంగా ఉంటే చాలని అనుకోవాలి. అంతేకానీ తనను చూడకుండా కూతురు ఉండలేదు.. అన్నట్లుగా పదే పదే కూతురును కలుస్తారు కొందరు. ఇలా పదే పదే కలవడం వల్ల వారిలో సొంత ఎనర్జీ ఉండదు. దీంతో సొంతంగా ఏ నిర్ణయం తీసుకోలేక మెట్టినింట్లో ఇబ్బందులు పడుతూ ఉంటారు. కూతురు జీవితం బాగుండాలంటే అల్లుడికి గౌరవం ఇవ్వాలి. చిన్న చిన్న తప్పులకు కూడా అల్లుడిపై పెద్ద పెద్ద అబాండాలు వేస్తూ వారిని అవమానించడం ద్వారా కూతురి జీవితాన్నే అవమానించినట్లవుతుందనేది గ్రహించుకోవాలి.
కొందరు తల్లులు అత్తారింట్లో ఆ పనులు చేయొద్దు..ఈ పనులు చేయొద్దు.. అని చెబుతూ ఉంటారు. ఇలా తల్లి మాట విని కొన్ని పనులు చేయకపోవడం వల్ల అత్తారింట్లో ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ క్రమంలో అత్త లేదా ఆడపడుచుతో గొడవలు అవుతాయి. ఈ సమయంలో భర్త కూడా వారికే సపోర్టు చేసే అవకాశం ఉంటుంది. అందువల్ల సొంతంగా నిర్ణయం తీసుకుని అందరికీ నచ్చిన విధంగా ఉండేలా అలవాటు చేసుకోవాలి.