https://oktelugu.com/

Akkineni Nageswara Rao: ఏఎన్నార్ చేసిన ఆ పని వల్ల 5,000 కళ్లజోళ్లు అమ్ముడయ్యాయా?

పౌరాణిక సినిమా ద్వారా ఏఎన్నార్ కెరీర్ మొదలు పెట్టగా జానపద హీరోగా ఆయన సినిమాలలో నటించారు. అయితే ఏఎన్నార్ సాంఘిక చిత్రాలకు సరిపోరని అప్పట్లో ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : November 15, 2023 / 10:31 AM IST

    Akkineni Nageswara Rao

    Follow us on

    Akkineni Nageswara Rao: అప్పట్లో కొందరు హీరోలు ఇప్పటికీ ఎంతో మందికి గుర్తుండిపోయారు. అందులో ముఖ్యంగా అక్కినేని నాగేశ్వరరావు అంటే ప్రజలకు మరింత ఇష్టం. ఈయన మరణించి ఎన్నో సంవత్సరాలు అవుతున్నా కూడా అభిమానులు ఆయనను ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారు. ఈయన నటించే సినిమా సూపర్ హిట్ అవుతుంటాయి. క్లాస్ సినిమాలతోనే ట్రెండ్ సృష్టించిన ఘనత నాగేశ్వరరావుకే సొంతం. అంతేకాదు ఈయన స్టైల్ నే చాలా మంది ఫాలో అయ్యేవారంటే ఇండస్ట్రీలో ఈయన ఏ రేంజ్ లో పేరు సంపాదించారో అర్థం చేసుకోవచ్చు.

    పౌరాణిక సినిమా ద్వారా ఏఎన్నార్ కెరీర్ మొదలు పెట్టగా జానపద హీరోగా ఆయన సినిమాలలో నటించారు. అయితే ఏఎన్నార్ సాంఘిక చిత్రాలకు సరిపోరని అప్పట్లో ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అంటే 1950వ సంవత్సరంలో సంసారం అనే సినిమాలో నటించే ఛాన్స్ ఏఎన్నార్ కు దక్కింది. జానపదాల నటుడు షర్టూ, ప్యాంట్ వేసుకొని కనిపించే పాత్రలో నటించడం ఏంటని కొంతమంది కామెంట్లు చేస్తే.. ఈ సినిమాలో చాలా వరకు రెమ్యునరేషన్ తగ్గించుకొని మరీ నటించారు.

    సంసారం అనే సినిమాలో కలనిజమాయెగా అనే సాంగ్ ఉంటుంది. అందులో ఏఎన్నార్ నలుచదరపు కళ్లద్దాలు ధరించి కనిపిస్తారు. ఈ అద్దాలు అప్పట్లో హాట్ టాపిక్ అయ్యాయి. దీంతో ఈ కళ్లద్దాలు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయట. ఓ ట్రెండ్ ను సృష్టించేలా చేశాడు నాగేశ్వరరావు. మయో ఆప్టికల్స్ నుంచి అప్పట్లో ఏకంగా 5000 కంటే ఎక్కువగా ఏఎన్నార్ ధరించిన కళ్లజోడు లాంటివి అమ్ముడయ్యాయి అంటే వాటి అక్కినేని ప్రభావం వాటిపై ఏ రేంజ్ లో పడిందో అర్థం చేసుకోవచ్చు.

    మనం అనే సినిమాతో ఏఎన్నార్ చివరి సారిగా ప్రేక్షకులను పలకరించారు. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అంతే కాదు ఇప్పటికీ ఎంతో మంది ఈ సినిమా గురించి మాట్లాడుతుంటారు. ఇక అక్కినేని హీరోలందరూ కూడా ఈ సినిమాలో కనిపించారు. కానీ ఇదే అక్కినేనికి చివరి సినిమా అవుతుంది అనుకోలేదు. మొత్తం మీద ఈ సినిమా వచ్చిన తర్వాత ఆయన తుది శ్వాస విడిచారు. చివరి సినిమా కూడా హిట్ ను సాధించి ఆయన గొప్పతనం తెలిసేలా చేశారని అంటారు అక్కినేని ఫ్యాన్స్. ఏది ఏమైనా ఒక్క సాంగ్ లో కళ్లద్దాలు ధరించి కొన్ని వేలల్లో అమ్ముడు అయ్యాయి అంటే ఆ ఘనత అక్కినేనికే దక్కుతుంది.