Sankranthi Movies 2024: సంక్రాంతి కి పోటీ పడుతున్న సినిమాలు బరిలో నిలిచేదేవరంటే..?

రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో వస్తున్న ఈగల్ సినిమాని సంక్రాంతికి బరిలో దించబోతున్నట్టుగా ఆమధ్య ఈ సినిమా ప్రొడ్యూసర్లు అనౌన్స్ చేయడం జరిగింది.

Written By: Gopi, Updated On : November 15, 2023 10:35 am

Sankranthi Movies 2024

Follow us on

Sankranthi Movies 2024: సినిమా ఇండస్ట్రీలో ఉన్న సినిమాలు ఫెస్టివల్ సీజన్ ని బేస్ చేసుకుని రిలీజ్ చేసుకోవడానికి ప్రొడ్యూసర్లు గానీ, హీరోలు గానీ, దర్శకులు గానీ ఎక్కువ ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. ఇక అందులో భాగంగానే రీసెంట్ గా దసరకి వచ్చిన బాలయ్య భగవంతు కేసరి, రవితేజ హీరోగా వచ్చిన టైగర్ నాగేశ్వరరావు సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. ఇక దసర సీజన్ ముగిసింది, మళ్లీ సంక్రాంతి సీజన్ మొదలవుతుంది.ఇక ఈ సంక్రాంతికి కూడా మన స్టార్ హీరోలు అందరూ వరుసగా వాళ్ళ సినిమాలని అనౌన్స్ చేసి సంక్రాంతి రేసులో నిలపడానికి సినిమాలను పూర్తిచేసే క్రమం లో బిజీగా ఉన్నారు.ఇక ఈ క్రమం లో ఏ సినిమాలు సంక్రాంతి బరిలో నిలిచే అవకాశం ఉందో ఒకసారి మనం తెలుసుకుందాం…

గుంటూరు కారం
త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వస్తున్న గుంటూరు కారం సినిమా జనవరి 12 వ తేదీన రిలీజ్ చేస్తాం అంటూ మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరిగింది. ఇక ఈ సినిమా చాలా రోజుల నుంచి షూటింగ్ జరుపుకుంటూ వస్తున్నప్పటికీ ఇప్పటివరకు అయితే షూటింగ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇక ఈ సినిమాకి సంభందించిన 4 పాటలు అలాగే ఒక వన్ వీక్ పాటు సాగే టాకీ పార్ట్ కూడా బ్యాలెన్స్ గా ఉంది. ఇక ఇలాంటి క్రమంలో సంక్రాంతికి ఒక రెండు నెలల గ్యాప్ మాత్రమే ఉండడం వల్ల ఎప్పుడు ఈ షూటింగ్ పూర్తి చేసి ఎప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకుని సినిమా ఇంకెప్పుడు సినిమా రిలీజ్ కి రెడీ చేస్తారు అనే సందేహాలు అందరిలో నెలకొన్నాయి. ఇక ఈ సినిమా అనుకున్న డేట్ కు రావాలి అంటే శరవేగంగా షూటింగ్ పూర్తి చేయాల్సి ఉంటుంది…

ఫ్యామిలీ స్టార్
విజయ్ దేవరకొండ హీరో గా పరుశురాం డైరెక్షన్ లో వస్తున్న ఫ్యామిలీ స్టార్ సినిమా కూడా సంక్రాంతికి రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేయడం జరిగింది. ఇక ఈ క్రమంలో సినిమా ఇంకా బ్యాలెన్స్ ఉండడంతో ఈ సినిమా సంక్రాంతి బరిలో నిలుస్తుందా లేదా అనుమానాలు చాలామందిలో వ్యక్తమవుతున్నాయి. ఇక ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన గ్లింస్ అందరినీ ఆకట్టుకుంది అందులో భాగంగానే ఈ సినిమా మీద కూడా ప్రేక్షకల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. మరి వీళ్ళు అనుకున్న డేట్ కి సంక్రాంతికి బరిలో దిగుతారా లేదా అనేది తెలియాల్సి ఉంది…

ఈగల్
రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో వస్తున్న ఈగల్ సినిమాని సంక్రాంతికి బరిలో దించబోతున్నట్టుగా ఆమధ్య ఈ సినిమా ప్రొడ్యూసర్లు అనౌన్స్ చేయడం జరిగింది. ఇక ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడంతో ఈ సినిమా పైన ప్రతి సినిమా అభిమాని కూడా మంచి అంచనాలను పెట్టుకున్నాడు.అలాగే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా డిసెంబర్ మొదటి వారంలో కల్లా పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని వన్ మంత్ లో ఫినిష్ చేసి సంక్రాంతికి బరిలో దింపుతున్నట్టుగా సినిమా యూనిట్ ఒక క్లారిటీ ఇచ్చింది…

హనుమాన్
తేజ సజ్జ హీరోగా, ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో వస్తున్న హనుమాన్ సినిమా మొదట చిన్న సినిమాగా స్టార్ట్ అయినప్పటికీ ఈ సినిమా నుంచి టీజర్ వచ్చిన తర్వాత ప్రతి ప్రేక్షకుడు కూడా ఈ సినిమా రిలీజ్ కోసం చాలా ఆసక్తి గా ఎదురు చూస్తున్నాడు అంటే ఆ టీజర్ ఇచ్చిన ఇంపాక్ట్ భారీ లెవెల్ లో ఉందనే చెప్పాలి. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పార్ట్ ఆల్మోస్ట్ పూర్తయినప్పటికీ ఈ సినిమా సంక్రాంతి బరిలో నిలవాలి అని చూస్తుంది కానీ సంక్రాంతి రేసులో పెద్ద సినిమాలు ఉండడంతో ఆ టైంలో వస్తే ఈ సినిమాకి అనుకున్న థియేటర్ దొరకకపోవడం ఒకటైతే, ఇంకోటి ఈ సినిమాకు అనుకున్నంత ఆదరణ కూడా దక్కదని భయపడుతున్నట్టుగా తెలుస్తుంది. దాంతో ఈ సినిమాని పోస్ట్ పోన్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి…

నా సామి రంగా
ఇక నాగార్జున హీరోగా వస్తున్న నా సామి రంగ సినిమా కూడా సంక్రాంతి బరిలో నిలుస్తుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమా ఇప్పటికే ఒకటి రెండు సాంగ్స్ ని మినహాయిస్తే షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి చేసుకుంది. దాంతో ఈ సినిమా కూడా సంక్రాంతి రేసులో ముందు వరుసలో ఉంది…

ఇక ఇవే కాకుండా డబ్బింగ్ సినిమాలు అయిన రజనీకాంత్, ధనుష్ హీరోలుగా వస్తున్న సినిమాలు కూడా సంక్రాంతి రేసు లో నిలుస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే వీటన్నింటికీ థియేటర్లు అడ్జెస్ట్ చేయడం అనేది చాలా కష్టమైన పని కాబట్టి వీటిలో చాలా సినిమాలు సంక్రాంతికి రాకపోవచ్చు… అంతే కాకుండా క్రిస్మస్ కానుకగా ప్రభాస్ సలార్ సినిమా కూడా వస్తుంది కాబట్టి ఈ సినిమా కనుక సూపర్ డూపర్ హిట్ అందుకుంటే సంక్రాంతి సినిమాల పైన సలార్ సినిమా ప్రభావం పడే అవకాశం అయితే ఉంది…
ఇక మొత్తానికి క్రాంతి బరిలో నిలిచే సినిమాలు ఏవి అనేది క్లారిటీ రావాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు…