spot_img
Homeక్రీడలు2022 Roundup India Cricket Team: 2022 రౌండప్‌ : ఆరంభ శూరత్వం.. ఈ ఏడు...

2022 Roundup India Cricket Team: 2022 రౌండప్‌ : ఆరంభ శూరత్వం.. ఈ ఏడు టీమిండియా వైఫల్యాల కథ 

2022 Roundup India Cricket Team ప్రపంచంలో ఏ దేశంలో లేనంత అభిమానులు టీం ఇండియా క్రికెట్‌కు ఉన్నారు. మ్యాచ్‌ ఏదైనా.. ఆడేది ఏ దేశంతో అయినా చూసేవారు మాత్రం కోట్లలో ఉంటారంటే అతిశయోక్తి కాదు. ఇండియా క్రికెటర్లను దేవుల్లుగా భావించే అభిమానులు ఉన్నారు. అయితే ఈ సంవత్సరం భారత జట్టు చాలా కీలక సందర్భాలలో విఫలమైంది. మూడు ఫార్మాట్లలోనూ భారత జట్టు ఎన్నో కీలక మ్యాచ్‌ల్లో ఓడిపోయి అభిమానులను 2022లో భారత జట్టు ప్రదర్శన నిరాశ పర్చింది.

2022 Roundup India Cricket Team
2022 Roundup India Cricket Team

ఈ సంవత్సరం భారత జట్టు ప్రదర్శన మిశ్రమంగా ఉంది. అంటే ఒకవైపు జట్టు ఎన్నో సిరీస్‌లను గెలుచుకుంది. మరోవైపు పెద్ద టోర్నీలలో ఓటమిని చవిచూసింది. మూడు ఫార్మాట్లలోనూ మిశ్రమ ఫలితాలను తన ఖాతాలో వేసుకుంది. ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను భారత జట్టు కోల్పోయింది. ఈ సంవత్సరం మూడు ఫార్మాట్లలో ముఖ్యమైన సందర్భాలలో జట్టు ప్రదర్శన అభిమానులను నిరాశపర్చింది.

టెస్ట్‌ క్రికెట్‌..
2021–22లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో భారత జట్టు 2–1 తేడాతో ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధించింది. కానీ, మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ భారత జట్టు ఓటమి పాలైంది. దీంతోపాటు ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లోనూ టీమిండియా ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఈ ఏడాది 7 టెస్టు మ్యాచ్‌లు ఆడిన భారత జట్టు నాలుగింటిలో విజయం సాధించింది.

2022 Roundup India Cricket Team
2022 Roundup India Cricket Team

వన్డే క్రికెట్‌..
ఈ ఏడాది భారత జట్టు ప్రదర్శన వన్డేల్లో అద్భుతంగా ఉంది. అయితే ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో టీమిండియా ఓడిపోయింది. బంగ్లాదేశ్‌ 2–1 తేడాతో భారత జట్టును ఓడించింది. అంతకుముందు న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో భారత జట్టు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. అయితే, ఆ సిరీస్‌లో ఒక్క మ్యాచ్‌ ఫలితం మాత్రమే వెల్లడైంది. ఇందులో న్యూజిలాండ్‌ గెలిచింది. ఈ ఏడాది వన్డే క్రికెట్‌లో 24 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా 14 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.

2022 Roundup India Cricket Team
2022 Roundup India Cricket Team

టీ20ల్లో ఓటమి..
ఈ ఏడాది టీ20 ఇంటర్నేషనల్‌లో భారత జట్టు రెండు కీలక సందర్భాల్లో ఓటమిని చవిచూసింది. ఆసియా కప్‌ 2022 సూపర్‌–4 నుంచి జట్టు మొదట నిష్క్రమించింది. ఆ తర్వాత టీ20 ప్రపంచకప్‌లో సెమీస్‌లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఈ ఏడాది మొత్తం 40 మ్యాచ్‌లు ఆడి 28 మ్యాచ్‌ల్లో గెలిచింది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

Avinash Reddy

Avinash Reddy: కడప నుంచి అవినాష్ రెడ్డి ఔట్!

Avinash Reddy: కడప విషయంలో జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం నడుస్తోంది. కడప ఎంపీ సీటు విషయంలో సిట్టింగ్ ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డికి ఈసారి మొండి చేయి చూపుతారు...
YSRCP

YSRCP: లోకేష్ కు టచ్ లో ఆ ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు?!

YSRCP: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన చాలామంది నేతలు అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. కూటమిలో ఛాన్స్ దక్కకపోవడంతో చాలామంది వేచి చూస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నామంటే ఉన్నాం అన్నట్టు వ్యవహరిస్తున్న...
US Iran War

US Iran War: ఇరాన్‌తో యుద్ధం.. దివాలా తీస్తున్న అమెరికా!

US Iran War: తన సామ్రాజ్యవాద విస్తరణ కాంక్ష తీర్చుకోవడానికి అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కిరణ్తో యుద్ధం మొదలుపెట్టాడు. ఫిబ్రవరి 28న ప్రారంభమైన యుద్ధం ఇప్పటికీ కొనసాగుతోది. యుద్ధం కారణంగా ఇరాన్...
Jana Nayagan Advance Bookings

Jana Nayagan Advance Bookings: అడ్వాన్స్ బుకింగ్స్ లో అంచనాలు అందుకోలేకపోయిన ‘జన నాయగన్’..ఎంత గ్రాస్ వచ్చిందంటే..

Jana Nayagan Advance Bookings: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' ఎట్టకేలకు అడ్డంకులను దాటుకొని , రేపు ప్రపంచవ్యాప్తంగా తెలుగు , తమిళ...
Oktelugu Epaper