Congress 2nd List : ఇంకా కాంగ్రెస్ ప్రకటించని సీట్లు ఇవీ

అందుకే ఆ జిల్లాలో సీట్లను హోల్డ్ లో పెట్టింది. ఖమ్మంలోని కొన్ని సీట్లను కమ్యూనిస్టులకే వదిలినట్టు తెలుస్తోంది.

Written By: NARESH, Updated On : October 27, 2023 10:40 pm
Follow us on

Congress 2nd List : కాంగ్రెస్ అధిష్టానం తాజాగా 2వ లిస్ట్ ను విడుదల చేసింది.ఇటీవలే మొదటి జాబితాలో 55 మందికి పైగా అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం ఈరోజు కీలకమైన మిగతా 45 స్థానాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించింది. మిగతా 19 సీట్లను మాత్రం హోల్డ్ లో పెట్టింది.

సీనియర్లు అందరికీ వారు కోరుకున్న వారు లోకల్ కాని సీట్లనే ఇవ్వడం గమనార్హం. ఎల్.బీ నగర్‌ నుంచి మాజీ ఎంపీ మధుయాస్కీ గౌడ్‌ (ఈయనది నిజామాబాద్), హుస్నాబాద్ నుంచి పొన్నం ప్రభాకర్‌ (ఈయనది కరీంనగర్), ఆదిలాబాద్‌ నుంచి కంది శ్రీనివాస్‌రెడ్డి, పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వర్‌రావు, మునుగోడు నుంచి కె. రాజ్‌గోపాల్‌రెడ్డిలను పోటీకి దింపింది.

నవంబర్ 30న జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి వరకు మొత్తం 100 మంది అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ప్రకటించినట్టైంది. రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇంకా మిగిలిన 19 అసెంబ్లీ స్థానాలు ఇవే.. ఇందులో రెండు నల్గొండ జిల్లాలోని సీట్లను కమ్యూనిస్టులకు ఇవ్వాలని ఆలోచిస్తుంది. అందుకే ఆ జిల్లాలో సీట్లను హోల్డ్ లో పెట్టింది. ఖమ్మంలోని కొన్ని సీట్లను కమ్యూనిస్టులకే వదిలినట్టు తెలుస్తోంది.

 

2. చెన్నూర్
13. జుక్కల్
14. బాన్సువాడ
16. కామారెడ్డి
17. నిజామాబాద్ (అర్బన్)
26. కరీంనగర్
29. సిరిసిల్ల
35. నారాయణఖేడ్
40. పటాన్ చెరు
66. చార్మినార్
88. మిర్యాలగూడ
91. సూర్యాపేట
96. తుంగతుర్తి
101. డోర్నకల్
111. ఇల్లందు
115. వైరా
116. సత్తుపల్లి
117. కొత్తగూడెం
118. అశ్వరావుపేట

(అసెంబ్లీ స్థానం నంబర్ తో పెండింగ్ నియోజకవర్గాలు)