Homeజాతీయ వార్తలు10 Beautiful Places : అద్దాల రైలులో దేశంలో చూడదగ్గ 10 అందమైన ప్రదేశాలివీ!

10 Beautiful Places : అద్దాల రైలులో దేశంలో చూడదగ్గ 10 అందమైన ప్రదేశాలివీ!

10 Beautiful Places  : భారతదేశంలో రైలు ప్రయాణం ఎంతో సౌకర్యవంతం.. తక్కువ ఖర్చుతో సుదూర ప్రాంతాలకు ప్రయాణించవచ్చు.. మిగతా వాటికంటే రైలు మార్గం అత్యంత పొడవైనది కూడా. మన దేశంలో రైలులో ప్రయాణిస్తున్నప్పుడు ఆ అనుభూతి మాటల్లో చెప్పలేని విధంగా ఉంటుంది. ఇక పర్యాటక ప్రదేశాలకు వెళ్లినప్పుడు రైలులో ఉంటే ఆహ్లాదాన్ని తనివితీరా ఎంజాయ్ చేయొచ్చు. అందమైన రైలు వెడల్పాటి అద్దాల నుంచి ఆ ప్రకృతి రమణీయతను ఆస్వాదింవచ్చు. కొందరు ఇతర రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నా.. రైలులో వెళ్లేందుకే ఇష్టపడుతారు. దేశంలోని కొన్ని ప్రాంతాలకు రైలులో మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. అంతేకాకుండా అవి చాలా అందమైన ప్రదేశాలు.. అలాంటి 10 ప్రదేశాల గురించి తెలుసుకుందాం..

-పశ్చిమ బెంగాల్ లోని డార్జిలింగ్
కొండ ప్రాంతాల్లో రైలులో జర్నీ చేయాలనుకునేవారికి డార్జిలింగ్ అనువైన ప్రదేశంగా చెప్పవచ్చు. ఇక్కడ 1881లోనే రైల్వేలైన్ ను ప్రారంభించారు. ఇక్కడి రైలు స్టీమ్ ఇంజన్ తో నడుస్తుంది. డార్జిలింగ్ పరిసర ప్రాంతాలను కలుపుతూ పర్వతాల గుండా రైలు ప్రయాణిస్తుంది. ఇక్కడ ఘూమ్ రైల్వేస్టేషన్ అత్యంత ఎత్తులో ఉంటుంది. 7,407 అడుగుల ఎత్తులో ఉండడంతో దీనిని ప్రపంచ వారసత్వం సంపదగా పేర్కొన్నారు.. దీనిని స్థానికులు బొమ్మ రైలు(టాయ్ ట్రైన్) అని పిలుచుకుంటారు.

-ఇండోర్ పటేల్ పానీ జలపాతం
మధ్యప్రదేశ్లోని కోరల్ నదిపై పటేల్ పానీ జలపాతం కనిపిస్తుంది. ఎత్తైన కొండల నుంచి జలపాతం కిందికి దూకుతుంటే ఆ ప్రదేశం ఎంతో అందంగా కనిపిస్తుంది. సుమారు 91 మీటర్లు అంటే 300 అడుగుల ఎత్తు నుంచి నీరు కిందికి దూకుతుంది. ఇండోర్ విమానాశ్రయం నుంచి 40 కిలోమీటర్ల దూరంలో పటేల్ పానీ జలపాతం కనిపిస్తుంది. ఇక్కడికి రైలుమార్గంలో వెళ్లడం మంచిది. ఇండోర్ సమీపంలోని అంబేద్కర్ నగర్ రైల్వేస్టేషన్ నుంచి పటేల్ పానీ జలపాతానికి చేరుకోవచ్చు.

-మంగుళూరు
వివిధ సంస్కృతులకు నిలయం మంగుళూరు పట్టణం. కర్ణాటక రాష్ట్రంలోని ఉన్న ఈ పట్టణం సముద్రమట్టానికి 45 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇక్కడి ప్రాంతం చుట్టూ అనేక పర్యాటక ప్రదేశాలున్నాయి. వాటిలో కొత్త మంగుళూరు రేవు, మంగళా దేవి ఆలయం, సెయింట్ అలోసియస్ చర్చి ప్రముఖమైనవి. అలాగే పణంబూర్ బీచ్, నేత్రావతి బ్రిడ్జి, కద్రి ఉద్యానవనం ఆహ్లదాన్ని కలిగిస్తాయి. మంగుళూరును రోడ్డు మీద కంటే రైలులో చూస్తే అందంగా కనిపిస్తుంది. పశ్చిమ కనుమల నుంచి రైలులో వెళితే ప్రకృతి రమణీ దృశ్యాలను చూడొచ్చు.

-జిరోవెల్లి-అరుణాచల్ ప్రదేశ్:
ప్రకృతి అందాలకు పెట్టింది పేరు అరుణాచల్ ప్రదేశ్. ఈ రాష్ట్రంలోని జీరో అనే గ్రామాన్ని తప్పకుండా దర్శించాలి. సముద్రమట్టానికి 1500 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ గ్రామం యునెస్కో వారసత్వ సంపదగా గుర్తించాలని ప్రతిపాదించారు. ఈటా నగర్ నుంచి 167 కిలోమీటర్ల దూరంలో జీరో ను చూడొచ్చు. అయితే ఇక్కడికి రైలు మార్గంలో వెళితే ఆ కొండకోనల్లోని సుందర దృశ్యాలను మిస్సవకుండా చూస్తారు.

goa

-కోల్వాబీచ్ -గోవా:
భారతదేశానికి పశ్చిమతీరంలోని గోవా రాష్ట్రంలో కోల్వా బీచ్ అత్యంత సుందరమైన ప్రదేశం. గోవాకు ఉత్తరాన ఉన్న బొగ్మా నుంచి దక్షిణాన ఉన్న కాబోడి రామ వరకు ఈ బీచ్ విస్తరించి ఉంది. సుమారు 25 కిలోమీటర్లు సముద్రం పక్కన ఆహ్లాదాన్ని పంచుతుంది. ఈ బీచ్ అక్టోబర్ లో రద్దీగా ఉంటుంది. ఇక్కడున్న కొల్వా చర్చ్ కూడా ప్రాముఖ్యత సాధించింది. ఇక్కడ సూర్యాస్తమయం చాలా అందంగా ఉంటుంది. కోల్వా బీచ్ కు వెళ్లాలంటే దబోలియ్ రైల్వేస్టేషన్, మడ్గోన్ రైల్వేస్టేషన్ నుంచి 21 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

Araku_valley-i

6. అరకువాలీ-ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉంది అరకులోయ. ఇది రాష్ట్రంలోని ప్రముఖ విశాఖపట్టణానికి 114 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అణువణువు ప్రకృతి రమణీయతతో విలసిల్లుతున్న తూర్పు కనుమలలోని అద్భుత పర్వతాల్లో ఉంది. విశాఖ నుంచి రైలులో అరుకు వెళ్తే ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేం.

7. పూణె-మహారాష్ట్ర:
మహారాష్ట్ర జిల్లాలోని పూణె నగరం ఎంతో ప్రాచీన కాలానికి చెందినది. ఇక్కడ నదులు, సరస్సులు, ఆనకట్టలు అద్భుతంగా ఉంటాయి. పుష్పవతి, కుకడి, మీనా నదులు ఆహ్లాదాన్ని పంచుతాయి. అలాగే యెద్గావ్, పింపల్లావ్ ఆనకట్టలు ప్రాముఖ్యతను పొందాయి. పూణె జిల్లాలో రెండు రైలు ప్రధాన జంక్షన్లు ఉన్నాయి. అవి పూణె , దౌండ్. ఈ నగరాన్ని రైలులో ప్రయాణించి చూస్తే అద్భుతంగా ఉంటుంది.

alipurdwara

8. అలిపురద్వార్-పశ్చిమబెంగాల్:
పశ్చిమబెంగాల్ లోని అలిపురద్వార్ ప్రముఖ నగరం. ఇది హిమాలయ పర్వత ప్రాంతలోని కల్జని నది ఒడ్డున ఉంది. అలిపురద్వార్ జిల్లాలో రైలు మార్గం 710 కిలోమీటర్లు విస్తరించి ఉంది. ఇక్కడ రైలులో ప్రయాణిస్తే ఏనుగులను చూడొచ్చు. అలాగే జల్దాపార నేషనల్ పార్క్ ను సందర్శించవచ్చు.

assam

9. హఫ్లోంగ్ -అస్సాం:
అస్సాంలో ప్రకృతి రమణీయ పర్యాటక ప్రదేశాలున్నాయి. ఇక్కడ ఉష్ణమండల శీతోష్ణస్థితిని కలిగి ఉండడంతో పచ్చని వాతావరణాన్ని చూడొచ్చు. అస్సాం రాజధాని గౌహతి నుంచి హఫ్లాంగ్ కు 310 కిలోమీటర్లు ఉంటుంది. హఫ్లాంగ్ కొండలు, లోయలు ఇక్కడ ప్రసిద్ధి. ఇవి సముద్ర మట్టానికి 680 మీటర్ల ఎత్తులో ఉంటాయి. ఇక్కడ సూర్యోదయం అద్భుతంగా కనిపిస్తుంది. వీటిని రైలులో ప్రయాణిస్తూ ఎంజాయ్ చేయొచ్చు.

10. బరోగ్- హిమాచల్ ప్రదేశ్
హిమాచల్ ప్రదేశ్లోని సొలన్ జిల్లాలో ఉంది బరోగ్. ఈ పర్వత శ్రేణి గురించి యునెస్కో గుర్తింపు కోసం ప్రయత్నించారు. చంఢీగఢ్ నుంచి కేవలం 60 కిలోమీటర్ల దూంలో బరోగ్ ఉంది. ఇక్కడ దగ్సాయి మ్యూజియం, సెల్యూలర్ జైల్ ప్రముఖమైనవి. అంతేకాకుండా ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ లో సొరంగ మార్గాలు ఎక్కువగా ఉన్నాయి. వీటిని రైలులో వెళ్లి చూస్తే అద్భుతంగా కనిపిస్తాయి. ఒక్కో సొరంగం దాటడానికి రైళ్లు గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి.

ఇలా దేశంలో రైలులో వెళుతూ తనివితీరా ఎంజాయ్ చేసే 10 ప్రదేశాలు ఉన్నాయి. వీటిని ఫ్యామిలీతో కలిసి వెళ్లి అస్వాదించవచ్చు. విదేశాలకు టూర్లు వెళ్లేవాళ్లు సైతం ఇండియాలోని ఈ మనోహర దృశ్యాలను చూస్తే అబ్బురపడకమానరు. మరి ఇంకెందుకు ఆలస్యం. ఈ రైలు జర్నీని ప్రారంభించండి.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular