Ayodhya Ram Temple Key : 400 కిలోల తాళం.. 4 అడుగుల ’కీ’.. అయోధ్యకు ప్రపంచంలోనే అతిపెద్ద తాళం..!

అయోధ్య రామమందిరంతోపాటు అయోధ్య పట్టణాన్ని కూడా యోగి ప్రభుత్వం సుందరంగా తీర్చిదిద్దుతుంది. అయోధ్య మొత్తం సోలార్‌ పవర్‌ వినియోగించేలా ప్లాంటు ఏర్పాట చేస్తున్నారు.

Written By: NARESH, Updated On : August 9, 2023 9:48 pm
Follow us on

Ayodhya Ram Temple Key : అయోధ్య రామ మందిర నిర్మాణానికి దేశవ్యాప్తంగా రామ భక్తులు ఉడతా భక్తిగా తమ వంతు సాయం అందిస్తూ వస్తున్నారు. కొందరు నగదు సాయం అందిస్తుండగా, కొందరు. ఆలయ నిర్మాణానికి అవసరమైన వస్తువులు, నిర్మాణం తర్వాత అవసరమైన వస్తువులు అందిస్తున్నారు. ఇలాగే అలీఘడ్‌కు చెందిన ఓ రామ భక్తుడు రామాలయానికి తనవంతు సాయం చేయాలనుకున్నాడు. తాళాల తయారీ వృత్తిగా జీవనం సాగిస్తున్న అతను రామాలయానికి అతిపెద్ద తాళం తయారు చేయాలని సంకల్పించాడు. భార్య సహాయంతో తయారీ ప్రారంభించారు. దాదాపుగా పనులు పూర్తికావొస్తున్నాయి. 400 కిలోలతో తాళం తయారు చేశాడు. దానికి 4 అడుగుల పొడవైన తాళం చెవి తయారు చేశాడు. ఈ ఏడాది చివరి నాటికి అయోధ్య రామాలయానికి దీనిని అందిస్తానని చెబుతున్నాడు.

సత్యప్రకాశ్‌శర్మ దంపతులు..
అలీఘడ్‌కు చెందిన శర్మ కుటుంబం శతాబ్దం కాలంగా తాళాల తయారీతో ఉపాధి పొందుతోంది.శర్మ కూడా తాళాలు కొట్టి పాలిష్‌ చేసే పనులు 45 ఏళ్లుగా చేస్తున్నాడు. అయోధ్య రామాలయం కోసం తనవంతుగా సాయం చేయాలని ఈ భారీ తాళం తయారు చేసినట్లు తెలిపారు. దీని ఎత్తు 10 అడుగులు, వెడల్పు 4 అడుగులు, 9.5 అంగుళాల మందంతో తయారు చేశాడు. ప్రస్తుతం చిన్నచిన్న మార్పులు, తుది మెరుగులు దిద్దే పనులు చేస్తున్నాడు. తాళంలో ఏ లోపం ఉండకుండా చూసుకుంటున్నాడు. భార్య రుక్ష్మిణీదేవి సహకారంతో ఈ భారీ తాళం తయారు చేశాడు సత్యప్రకాశ్‌శర్మ.

గతంలో 6 అడగుల తాళం..
తాము గతంలో 6 అడుగుల పొడవైన తాళం తయారు చేశామని, దాని వెడల్పు 3 అడుగులు ఉండేదని రుక్మిణీ దేవి తెలిపింది. కొంత మంది అయోధ్య కోసం అంతకన్నా పెద్ద తాళం చేయాలని సూచించారని చెప్పింది. అందుకే ఈ తాళం తయారీ ప్రారంభించామని పేర్కొంది. దీని తయారీకి తన జీవితకాలంలో చేసిన పొదుపు మొత్తం రూ.2 లక్షలు ఖర్చయిందని సత్యప్రకాశ్‌ తెలిపాడు.

ఈ ఏడాది చివరన అప్పగింత..
పూర్తిగా సిద్ధమైన ఈ తాళాన్ని ఈ ఏడాది చివరన అయోధ్య రామాలయానికి అప్పగిస్తామని తెలిపారు శర్మ దంపతులు. ఈమేరకు రామాలయ నిర్మాణ ట్రస్టు సభ్యులతో కూడా మాట్లాడామని చెప్పారు. శర్మ దంపతులు తయారు చేసిన ఈ తాళం ప్రపంచంలోనే అతిపెద్ద తాళంగా రికార్డులకు ఎక్కనుంది. దీనిని ఎక్కడ వినియోగించాలో ఆలోచిస్తామని ట్రస్టు ప్రతినిధి తెలిపారు.

తుది దశకు రామాలయ నిర్మాణం..
ఇదిలా ఉండగా అయోధ్య రామాలయ నిర్మాణం తుది దశకు చేరుకుంది. సర్వాంగ సుందరంగా ఆలయ నిర్మాణం జరుగుతోంది. 80 శాతం పనులు పూర్తికాగా, 20 శాంత తుది మెరుగులు దిద్దే పనులు ఉన్నాయి. మూడ అంతస్తుల్లో నిర్మిస్తున్న ఆలయంలో మూడు అడుగుల ఎత్తయిన రామాలయం ఏర్పాటు చేసేందుకు ట్రస్టు ప్రతినిధులు నిర్ణయించారు. విగ్రహంపై తొలి సూర్యకిరణ పడేలా నిర్మాణం చేస్తున్నారు.

సోలార్‌ సిటీగా..
అయోధ్య రామమందిరంతోపాటు అయోధ్య పట్టణాన్ని కూడా యోగి ప్రభుత్వం సుందరంగా తీర్చిదిద్దుతుంది. అయోధ్య మొత్తం సోలార్‌ పవర్‌ వినియోగించేలా ప్లాంటు ఏర్పాట చేస్తున్నారు. ఇండియాలోనే సెకండ్‌ సోలార్‌ సిటీగా రూపుదిద్దుతున్నారు. మధ్యప్రదేశ్‌లోని సాంచి తర్వాత అయోధ్యనే సోలార్‌ సిటీగా అవతరించబోతోంది. 2024, జనవరిలో ఆలయాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.