https://oktelugu.com/

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కు ఆ సెంటిమెంట్ కలిసి రావడం లేదా..? మరి ఓజీ పరిస్థితి ఏంటి..?

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ మొత్తం స్టార్ హీరోల చేతిలోనే ఉంది. వాళ్ల సినిమాలు మాత్రమే ఎక్కువ బిజినెస్ చేస్తూ భారీ కలెక్షన్స్ ను రాబడుతూ ప్రొడ్యూసర్లకు భారీ లాభాలను తీసుకొచ్చి పెడుతున్నాయి. తద్వారా సినిమా ఇండస్ట్రీ రేంజ్ పెరగడమే కాకుండా హీరోల మార్కెట్ కూడా భారీగా పెరుగుతుంది...

Written By:
  • Gopi
  • , Updated On : October 18, 2024 / 09:17 AM IST

    Pawan kalyan

    Follow us on

    Pawan Kalyan : తెలుగు సినిమా పేరు చెబితే ముందుగా మనకు మెగా ఫ్యామిలీ గుర్తుకొస్తుంది. అందులో మెగాస్టార్ చిరంజీవి ఎవరికి అందనంత ఎత్తులో ఉండగా, ఆయన తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం తనదైన రీతిలో ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఏపీ డిప్యూటీ సీఎం గా పదవి బాధ్యతలను కొనసాగిస్తూనే సినిమా షూటింగ్ లో కూడా పాల్గొనడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇక ఇప్పటికే ‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగ లో పాల్గొంటున్నారు. ఇక దాని తర్వాత సుజిత్ డైరెక్షన్ లో చేస్తున్న ఓజి సినిమా షూటింగ్ లో పాల్గొనడానికి కూడా సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. నిజానికి ఈ సినిమా మార్షల్ ఆర్ట్స్ కు సంబంధించిన సినిమా కావడం విశేషం… అందులోను పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో కొద్దిసేపు మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్ గా కనిపించబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక కొద్దిరోజుల క్రితం రిలీజ్ అయిన ఈ టీజర్ ను బట్టి చూస్తే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాలో సిస్టర్ సెంటిమెంట్ ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. నిజానికి పవన్ కళ్యాణ్ కి సిస్టర్ సెంటిమెంట్ సినిమాలు పెద్దగా వర్కౌట్ అవ్వలేదు.
    ఇంతకుముందు గతంలో కనక చూసుకుంటే సిస్టర్ సెంటిమెంట్ తో వచ్చిన అన్నవరం సినిమాతో ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయాడు. ఈ సినిమా సిస్టర్ సెంటిమెంట్ తో తెరకెక్కి ప్రేక్షకులను ఏ మాత్రం ఎన్టీయార్ టైన్ చేయలేకపోయింది. అందువల్ల ఈ సినిమా ప్లాప్ గా మిగిలింది. ఇక ఇప్పుడు కూడా వస్తే మాత్రం సినిమా ఎలా ఉండబోతుంది. అనే దానిమీద పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా వరకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
    ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో భారీ సక్సెస్ ని సాధిస్తానని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఇక దానికి అనుగుణంగానే ఈ సినిమా చేసి సూపర్ సక్సెస్ సాధించాలని తన కోరుకుంటున్నట్టుగా తెలుస్తోంది. మరి సిస్టర్ సెంటిమెంట్ అప్పుడు వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు వర్క్ అవుట్ అవుతుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే డైరెక్టర్ సుజీత్ కి ఎమోషన్స్ ను బాగా హ్యాండిల్ చేయగలడనే పేరైతే సంపాదించుకున్నాడు.
    మరి ఏదైనా మ్యాజిక్ చేసి ఈ సినిమాను సక్సెస్ ఫుల్ గా నిలుపుతాడా లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది…ఇక ఏది ఏమైనా కూడా పవన్ కళ్యాణ్ ఇప్పుడు దూకుడు పెంచి వరుసగా సినిమాలు చేస్తూ ముందుకు సాగుతూ ఉండడమనేది నిజంగా అతని అభిమానులకు చాలా ఆనందాన్ని కలిగించే విషయమనే చెప్పాలి…