https://oktelugu.com/

Rahul Gandhi: ఏపీ పై రాహుల్ భారీ స్కెచ్.. షర్మిల చేతికి ఆ జాబితా!

ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవానికి హై కమాండ్ తహతహలాడుతోంది. వైసీపీ ఇబ్బందికర పరిస్థితుల్లో ఉండడంతో.. ఆ పార్టీ శ్రేణులను ఆహ్వానించాలని భావిస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఏపీ పై దృష్టి పెట్టడం విశేషం.

Written By:
  • Dharma
  • , Updated On : October 18, 2024 / 09:18 AM IST

    Rahul Gandhi(3)

    Follow us on

    Rahul Gandhi: వైసీపీ నేతలు కొందరు కాంగ్రెస్ టచ్ లోకి వెళ్ళారా? ఆ పార్టీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నారా? మహారాష్ట్ర ఎన్నికల తర్వాత క్లారిటీ రానుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వాస్తవానికి హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి ఉంటే.. దాని ప్రభావం ఏపీలో కనిపించి ఉండేదని టాక్ నడుస్తోంది. గతం కంటే కాంగ్రెస్ పుంజుకుంది. ఏపీలో సైతం ఉనికి చాటుకునేందుకు ప్రయత్నిస్తోంది. అందుకే రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిలకు బాధ్యతలు అప్పగించింది. అయితే ఎన్నికల్లో జగన్ ను ఓడించేందుకు షర్మిల ప్రయత్నించారు. ఆ విషయంలో సక్సెస్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఈ పరిస్థితికి జగన్ కారణం. అదే జగన్ ను షర్మిల ద్వారా దెబ్బకొట్టింది కాంగ్రెస్ నాయకత్వం. అయితే ఇప్పుడు వైసీపీ దిక్కులేని స్థితిలో ఉంది. ఆ పార్టీకి పెద్ద ఎత్తున నేతలు గుడ్ బై చెబుతున్నారు. ఇదే తరుణంలో కాంగ్రెస్ పార్టీ వైసీపీ స్థానాన్ని భర్తీ చేయాలని చూస్తోంది. అందుకు సరైన ప్లాన్ రూపొందిస్తోంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ ఏపీ పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు సమాచారం. షర్మిలకు సలహాలు సూచనలు అందించినట్లు తెలుస్తోంది. దీంతో షర్మిల ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు అర్థమవుతోంది.

    * వైసీపీ సీనియర్లు సైలెంట్
    వైసీపీలో చాలామంది సీనియర్లు సైలెంట్ అయ్యారు. అటువంటి వారి పూర్వశ్రమం కాంగ్రెస్. ఆ పార్టీలో ఒక వెలుగు వెలిగిన నేతలు ప్రత్యామ్నాయం లేకపోవడంతో వైసీపీలో చేరారు. ఇప్పుడు వైసీపీకి గడ్డు పరిస్థితులు ఎదురు కావడంతో వారు పునరాలోచనలో పడ్డారు. కాంగ్రెస్ పార్టీలో చేరితే ఎలా ఉంటుందోనని ఆలోచిస్తున్నారు. ఇప్పటికే షర్మిలకు కొంతమంది ఫోన్ చేసి తమ సమ్మతిని వ్యక్తం చేసినట్లు సమాచారం. కడప, చిత్తూరు, ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన నేతలు కాంగ్రెస్లో చేరేందుకు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. అటు కాంగ్రెస్ అగ్ర నాయకత్వంతో సంప్రదింపులు జరుపుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ షర్మిలను ప్రత్యేకంగా రప్పించుకొని.. కాంగ్రెస్ పార్టీలో చేరబోయే వైసిపి నేతల జాబితా ఇచ్చినట్లు తెలుస్తోంది.

    * ఆ ప్రభావం ఏపీ పై
    త్వరలో రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ తో పాటు మిత్రపక్షాలు అక్కడ విజయం సాధిస్తే దాని ప్రభావం ఏపీ పై పడే అవకాశం ఉంది. అయితే వైసీపీ నేతల కాంగ్రెస్ పార్టీలో చేరిక విషయంలో చాలా రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. జనవరి తర్వాత రాష్ట్రంలో మూడు చోట్ల భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసి.. వైసిపి నేతలను ఆహ్వానించాలన్నది వ్యూహంగా తెలుస్తోంది. ఇండియా కూటమి నేతలను ఆహ్వానించి ఒక ఊపు తేవాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రధానంగా రాయలసీమపై షర్మిల ఫోకస్ పెట్టారు. ఉత్తరాంధ్రతో పాటు కోస్తాపై కూడా కొంతమంది నేతలు దృష్టి సారించారు. ప్రధానంగా లగడపాటి రాజగోపాల్, ఉండవల్లి అరుణ్ కుమార్, ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ నేత ఒకరు పెద్ద వ్యూహమే పన్నుతున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే వైసీపీకి చెందిన నేతలతో పాటు క్యాడర్ కాంగ్రెస్ గూటికి రావడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.