Rohit Sharma vs Gautam Gambhir : ధోని పురిటి గడ్డపై ఆదివారం దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన వన్డే మ్యాచ్ లో టీమిండియా 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ సూపర్ సెంచరీ తో ఆకట్టుకున్నాడు. రోహిత్ శర్మ ఆర్ధ సెంచరీ చేసి సత్తా చూపించాడు. విరాట్ కోహ్లీ ఏకంగా 135 పరుగులు చేసి సరికొత్త చరిత్ర సృష్టించాడు. విరాట్, రోహిత్ ద్వయం మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో దక్షిణాఫ్రికా బౌలర్లు ప్రేక్షకులుగా మారిపోయారు.
కొద్దిరోజుల నుంచి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వన్డే రిటైర్మెంట్ గురించి చర్చ నడుస్తోంది. వారిద్దరూ సరిగ్గా ఆటంలేదని కొంతమంది పని కట్టుకొని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ ఫామ్ గురించి వస్తున్న రూమర్స్ కు బలమైన చెక్ పెట్టారు రోహిత్, విరాట్. గౌతమ్ గంభీర్ కోచ్ గా వచ్చిన తర్వాత రోహిత్, విరాట్ టెస్ట్, టి20 ఫార్మాట్ నుంచి తప్పుకున్నారు. టీమిండియా టి20 వరల్డ్ కప్ సాధించిన తర్వాత విరాట్, రోహిత్ అందులో నుంచి గౌరవప్రదంగా తప్పుకున్నారు. కానీ టెస్ట్ ల నుంచి మాత్రం బలమైన ఒత్తిడి వల్ల వారిద్దరూ వెళ్లిపోయారని ప్రచారం జరిగింది. ఇలా ఒత్తిడి తీసుకురావడానికి ప్రధాన కారణం గౌతం గంభీర్ అని జాతీయ మీడియాలో ఇప్పటికి కథనాలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే వీటిని అవును అని కానీ కాదు అని కానీ రోహిత్, విరాట్ ఇంతవరకు చెప్పలేదు.
ఇవన్నీ ఇలా జరుగుతుండగానే రాంచీ వేదికగా జరిగిన వన్డే మ్యాచ్లో విరాట్ సూపర్ సెంచరీ, రోహిత్ హాఫ్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. భారత జట్టు గెలిచిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లో రోహిత్ శర్మ, గౌతమ్ గంభీర్ ఉత్సాహంగా మాట్లాడుకున్నారు. వారిద్దరి మధ్య తీవ్రమైన చర్చ జరిగినట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. గౌతమ్ గంభీర్ ఏదో చెప్పబోతుండగా.. రోహిత్ శర్మ వారించినట్టు కనిపించింది. రోహిత్ చెబుతున్న ప్రతి మాటను గౌతమ్ గంభీర్ శ్రద్ధగా వింటున్నట్లు సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్న వీడియోలో దర్శనమిచ్చింది.. ఇద్దరి మధ్య ఏం జరిగి ఉంటుంది? ఇటీవల ఓటములు ఇద్దరి మధ్య చర్చకు వచ్చాయా? టెస్టులలోకి తిరిగి రోహిత్ ను రమ్మని గౌతమ్ గంభీర్ కోరుతున్నాడా? ఇలా రకరకాల ప్రశ్నలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. కాకపోతే ఈ వీడియో ఇప్పటికే మిలియన్లలో లైక్స్ సొంతం చేసుకోవడం విశేషం.
Head Coach Gautam Gambhir and Rohit Sharma were seen in discussion after the first ODI in Ranchi!
Any guesses what they were talking about? #INDvSA #RohitSharma #GautamGambhir pic.twitter.com/KyvxJihwxl
— Sportskeeda (@Sportskeeda) November 30, 2025