అందం , అభినయంతో పర్ఫెక్ట్ హీరోయిన్ మెటీరియల్ అనిపించుకుంది శ్రద్దాదాస్. కానీ ఎందుకో వెండితెరపై స్టార్డమ్ దక్కించుకోలేకపోయింది.
దాదాపు 17 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉంటున్నా.. ఇప్పటికీ బ్రేక్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తుంది.
హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా అవకాశాల కోసం ఇప్పటికీ ట్రై చేస్తుంది ఈ బ్యూటీ.
1987 మార్చి 4న మహారాష్టలోని ముంబైలో వ్యాపార కుటుంబంలో జన్మించింది శ్రద్ధా దాస్.
ఆమె తండ్రి వ్యాపారవేత్త. అయితే వీరి స్వస్థలం పశ్చిమ బెంగాల్లోని పురులియా.
వ్యాపార రీత్యా శ్రద్ధ కుటుంబం ముంబైకి వచ్చింది.. ప్రతిష్టాత్మక ముంబై విశ్వవిద్యాలయం నంచి మీడియాలో డిగ్రీ చేసింది.
ఇక 2008లో అల్లరి నరేష్ హీరోగా నటించిన సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాతో తెలుగు వారికి పరిచయం అయింది
డార్లింగ్, నాగవల్లి, గుంటూరు టాకీస్, పీఎస్వీ గరుడ వేగ వంటి పలు సినిమాల్లో నటించింది.