Shriya Saran : మన చిన్నతనం నుండి అమితంగా ఇష్టపడిన హీరోయిన్స్ లో ఒకరు శ్రీయ శరన్. ఈమె అప్పట్లో ప్రతీ ఒక్కరికి క్రష్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇష్టం అనే చిత్రం తో వెండితెర అరంగేట్రం చేసిన ఆమె, ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటించి అతి తక్కువ సమయంలోనే తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఇప్పటికీ ఈమె వరుసగా సినిమా అవకాశాలను సంపాదిస్తూ నేటి తరం హీరోయిన్స్ తో పోటీ పడుతుడంటే ఆమె రేంజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. కొంతమంది హీరోయిన్స్ కి అందం ఉంటే టాలెంట్ ఉండదు,టాలెంట్ ఉంటే అందం ఉండదు. ఈ రెండు కలిగి ఉన్నవాళ్లు అదృష్టవంతులు. శ్రీయ కి ఆ రెండు తో పాటుగా డ్యాన్స్ కూడా బోనస్ అన్నమాట. అందుకే ఆమె ఇన్నేళ్లు ఇండస్ట్రీ లో నెట్టుకురాగలిగింది.
అయితే ప్రస్తుతం ఆమె హీరోయిన్ రోల్స్ బాగా తగ్గించి ముఖ్య పాత్రలు పోషించడానికి మాత్రమే పరిమితమైంది. ఇదంతా పక్కన పెడితే శ్రీయ ని బెల్లంకొండ సురేష్ అనే నిర్మాత తాను శ్రీయ కి చేసిన మోసం గురించి ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ ‘శ్రీయ ని ఒక రోజు నేను సినిమా కోసం డేట్స్ అడిగాను, హీరో ఎవరు అని అడిగింది, తరుణ్ అని చెప్పను ఇప్పటికే అతనితో చాలా సినిమాలు చేశాను, మళ్లీ అతనితోనే అంటే కుదరదు అని చెప్పింది. అప్పుడు నేను ఆమెకు ముందు స్టోరీ చెప్తాను, నచ్చితే చెయ్యి, లేదంటే లేదు అని చెప్పాను. దానికి ఆమె అంగీకరించింది. ఆ తర్వాత ఆమెకు స్టోరీ చెప్పాను, ఆమెకు తెగ నచ్చేసింది. కానీ నేను చెప్పిన స్టోరీ తరుణ్ సినిమాకి సంబంధించినది కాదు. ఎన్టీఆర్ ఆది స్టోరీ చెప్పాను. కథ ఆమెకి నచ్చింది, వెంటనే అడ్వాన్స్ తీసుకుంది. కానీ నేను కొన్ని అనుకోని కారణాల ఆ సినిమా చేయలేకపోయాను’ అంటూ చెప్పుకొచ్చాడు బెల్లంకొండ.
అలా ఆయన సమంత కి ఆది స్టోరీ చెప్పి మోసం చేసి డేట్స్ సంపాదించాను అంటూ బెల్లంకొండా సురేష్ చెప్పుకొచ్చాడు. ఈయన కుమారుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇండస్ట్రీ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మాస్ సినిమాలు తీస్తూ ఇతను తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్నాడు. కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈయన అతి త్వరలోనే ‘భైరవం’ అనే చిత్రం ద్వారా మన ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రంలో నారా రోహిత్, మంచు మనోజ్ ముఖ్య పాత్రలు పోషించగా, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఒకప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీ గా ఉండేవాడు బెల్లంకొండ సురేష్. కానీ ఎందుకో ఈమధ్య బాగా స్లో అయిపోయాడు. 2014 వ సంవత్సరం లో ఈయన రభస అనే చిత్రం చేసాడు. ఆ తర్వాత మళ్లీ సినిమాలు తీయలేదు.