మహారాష్ట్రకు చెందిన మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు.Photo Credit Instagram
2012లో ముజ్‌సే కుచ్ కెహ్తీ.. యే ఖామోషియాన్ అనే సీరియల్‌లో బాలనటిగా ఎంట్రీ ఇచ్చింది ఈ అమ్మడు.Photo Credit Instagram
ఆ తర్వాత 2014లో విట్టి దండు అనే మరాఠీ సినిమాతో తొలిసారి వెండితెర మీద అడుగుపెట్టింది.Photo Credit Instagram
ఇక 2018లో లవ్ సోనియాలో నటించారు. తర్వాత తుఫాన్, ధమాక, జెర్సీ సినిమాల్లో కనిపించి మెప్పించింది ఈ బ్యూటీ.Photo Credit Instagram
అంతకుముందు కలర్స్ టీవీలో బాక్స్ క్రికెట్ లీగ్‌లో, డ్యాన్స్ రియాలిటీ షో నాచ్ బలియే సీజన్ 7లో మెరిసి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది.Photo Credit Instagram
ఇక హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా వచ్చిన సీతారామం సినిమాతో ఈ అమ్మడు ఫేత్ మారిపోయిందని చెప్పాలి.Photo Credit Instagram
అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది మృణాల్ ఠాకూర్. ఆతర్వాత ఆఫర్లకు కొదవలేదనే చెప్పాలి.Photo Credit Instagram
హాయ్ నాన్న, ది ఫ్యామిలీ స్టార్, కల్కి 2898 ఏడీ వంటి సినిమాల్లో మెరిసింది ఈ మహారాష్ట్ర బ్యూటీ.Photo Credit Instagram