Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేక విమానం ఏర్పాటు చేసిన ‘పుష్ప’ మేకర్స్..ఫ్యాన్స్ కి ఫ్యూజులు ఎగిరే అప్డేట్!

ఈ చిత్రం కోసం పవన్ కళ్యాణ్ కేవలం మూడు వారాల పాటు డేట్స్ ఇస్తే సరిపోతుంది. 'హరి హర వీరమల్లు' చిత్రం వచ్చే ఏడాది మార్చి 28వ తారీఖున విడుదల అవ్వబోతుంటే, 'ఓజీ' చిత్రాన్ని వచ్చే ఏడాది దసరా కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ రెండు చిత్రాల పై అభిమానుల్లో, ప్రేక్షకుల్లో ఏ స్థాయి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ రెండు సినిమాలతో పాటు పవన్ కళ్యాణ్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో 'ఉస్తాద్ భగత్ సింగ్' అనే చిత్రం ప్రారంభించిన సంగతి అందరికీ తెలిసిందే.

Written By: Vicky, Updated On : October 22, 2024 5:10 pm

Pawan Kalyan(27)

Follow us on

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక పక్క ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూనే, మరోపక్క సినిమాలు చేస్తూ క్షణకాలం తీరిక లేకుండా గడుపుతున్న సంగతి అందరికి తెలిసిందే. గత రెండు వారాల నుండి ఆయన ‘హరి హర వీరమల్లు’ చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్నాడు. చిత్రీకరణ చివరి దశలో ఉన్న ఈ చిత్రం, ఈ నెల 31వ తేదీతో పవన్ కళ్యాణ్ కి సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి చేసుకోనుంది. ఈ సినిమాతో పాటుగా రీసెంట్ గానే హైదరాబాద్ లో ‘ఓజీ’ మూవీ షూటింగ్ కూడా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రముఖ ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ సారథ్యం లో ఒక భారీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరించాడు డైరెక్టర్ సుజిత్. నవంబర్ రెండవ వారం నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ విజయవాడ లో జరగనుంది. అక్కడ పవన్ కళ్యాణ్ పై బైక్ రేస్ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరించబోతున్నారు, ఇది ఈ సినిమాకి ఇంటర్వెల్ బ్లాక్ అట.

ఈ చిత్రం కోసం పవన్ కళ్యాణ్ కేవలం మూడు వారాల పాటు డేట్స్ ఇస్తే సరిపోతుంది. ‘హరి హర వీరమల్లు’ చిత్రం వచ్చే ఏడాది మార్చి 28వ తారీఖున విడుదల అవ్వబోతుంటే, ‘ఓజీ’ చిత్రాన్ని వచ్చే ఏడాది దసరా కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ రెండు చిత్రాల పై అభిమానుల్లో, ప్రేక్షకుల్లో ఏ స్థాయి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ రెండు సినిమాలతో పాటు పవన్ కళ్యాణ్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే చిత్రం ప్రారంభించిన సంగతి అందరికీ తెలిసిందే. 30 శాతం కి పైగా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని కూడా త్వరలో ప్రారంభించేందుకు మైత్రీ మూవీ మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆర్టిస్ట్స్ డేట్స్ ని లాక్ చేసి వాళ్ళ కోసం హోటల్ రూమ్స్ కూడా బుక్ చేస్తున్నారట. ఇది ఇలా ఉండగా అమరావతి లో ఒక చిన్న షెడ్యూల్ ని జరిపి, మిగతా షూటింగ్ మొత్తం రామోజీ ఫిలిం సిటీ లో జరపాలని నిర్మాతలు ప్లాన్ చేశారట.

ఎందుకంటే ఆర్టిస్టులకు పూర్తి స్థాయిలో అమరావతిలో షూటింగ్ చేసేందుకు ఇబ్బందిగా ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నారట. కానీ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి, ఆయనకీ చాలా పనులు ఉంటాయి, రోజుకి ఎన్నో రివ్యూ మీటింగ్స్ లో ఆయన పాల్గొంటూ ఉంటాడు. ఇలాంటి సందర్భంలో అంత సమయం వృధా చేయలేడు కాబట్టి ఆయన కోసం మేకర్స్ ఒక ప్రత్యేక ఫ్లైట్ ని సిద్ధం చేశారట. రోజుకి నాలుగు గంటలు షూటింగ్ చేసి అరగంటలోపే అమరావతి కి వెళ్లిపోయేలా ప్లానింగ్ చేశారట. దీనికి పవన్ కళ్యాణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. నవంబర్ ఎండింగ్ లో కానీ, లేదా డిసెంబర్ మొదటి వారంలో కానీ ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.