పారిస్ ఒలింపిక్స్ లో ఈసారి సంచలనానికి కేంద్ర బిందువుగా నిలిచింది లువానా అలోన్సో.. తన అందం వల్ల ఒలింపిక్స్ పోటీలలో మధ్యలోనే తిరిగి తన దేశానికి వచ్చింది..స్విమ్మర్ అయిన లువానా అలోన్సో గురించి ఆసక్తికర సంగతులవి. Photo: Instagram
లువానా అలోన్సో.. ప్రొఫెషనల్ స్విమ్మర్. సెప్టెంబర్ 19, 2004లో దక్షిణ అమెరికాలోని పరాగ్వే లో ఈమె జన్మించింది. చిన్నప్పట్నుంచి ఈమెకు స్విమ్మింగ్ కంటే చాలా ఇష్టం. Photo: Instagram
లువానా అలోన్సో డల్లాస్ లోని సెయింట్ మెథడిస్ట్ విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తోంది. 17 సంవత్సరాల వయసులో ఒలింపిక్స్ లో అడుగు పెట్టింది. 2020లో టోక్యో ఒలంపిక్స్ లో పాల్గొని.. స్విమ్మింగ్ విభాగంలో 28వ స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. Photo: Instagram
పారిస్ వేదికగా జరిగిన ఒలంపిక్స్ లో 100 మీటర్ల స్విమ్మింగ్ బట్టర్ ఫ్లై ఈవెంట్ లో సత్తా చాటినప్పటికీ, 0.24 సెకండ్ల తేడాతో మెడల్ మిస్ చేసుకుంది. Photo: Instagram
పోటీ మిగిసినప్పటికీ ఈత దుస్తుల్లో కనిపించి.. తమ దృష్టి మళ్లిస్తోందని స్విమ్మర్లు ఫిర్యాదు చేయడంతో.. ఆమెను ఒలింపిక్స్ మధ్యలో నుంచి సొంత దేశానికి పంపించారని ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత లువానా అలోన్సో స్విమ్మింగ్ కు గుడ్ బై చెప్పేసింది.. Photo: Instagram
సొంత దేశానికి వెళ్ళిన తర్వాత లువానా అలోన్సో సంచలన కామెంట్స్ చేసింది. తనను ఎవరూ సొంత దేశానికి పంపించలేదని, పనికిమాలిన వార్తలు ప్రసారం చేయొద్దని హెచ్చరించింది. Photo: Instagram
లువానా అలోన్సో సామాజిక మాధ్యమాలలో చురుకుగా ఉంటుంది. ఆమె ఈత కొట్టిన వీడియోలను, దృశ్యాలను అందులో పంచుకుంటుంది. ఈమెను సామాజిక మాధ్యమాలలో అనుసరించే వారి సంఖ్య 8 లక్షలకు పైగా ఉంటుంది. Photo: Instagram
లువానా అలోన్సో ఎక్కడికి వెళ్లినా బర్గర్ తింటుంది. ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పటికీ అక్కడ ఫేమస్ ఫుడ్ లాగిస్తుంది. ఆ తర్వాత జిమ్ లో కసరత్తులు చేస్తూ ఉంటుంది. Photo: Instagram
లువానా అలోన్సో జంతు ప్రేమికురాలు. పక్షులను విపరీతంగా ఇష్టపడుతుంది. వాటితో దిగిన ఫోటోలను సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేస్తుంది. అన్నట్టు ఈమె ఒక పక్షిని కూడా పెంచుకుంటున్నది. Photo: Instagram
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Interesting facts about paraguayan swimmer luana alonso
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com