https://oktelugu.com/

Pickleball: రంధ్రాలు పడిన బంతి.. చెక్క బ్యాట్.. పికిల్ బాల్ ఆడే తీరే వేరయా

పికిల్ బాల్ ను మొట్టమొదటిగా ఆడింది అమెరికా పొలిటికల్ లీడర్ జోయల్ ప్రిట్చర్డ్. తన కుటుంబంతో సరదాగా బయటికి వెళ్లినప్పుడు ఆయన ఈ ఆటను ఆడారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : August 23, 2024 2:54 pm
    1 / 6 ఎక్కడో అమెరికాలో 1965లో పికిల్ బాల్ గేమ్ మొదలైంది.. తర్వాత ఇన్ని సంవత్సరాలకు మనదేశంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇంతకీ ఈ గేమ్ ఎలా ఉంటుందంటే..
    2 / 6 పికిల్ బాల్ ను మొట్టమొదటిగా ఆడింది అమెరికా పొలిటికల్ లీడర్ జోయల్ ప్రిట్చర్డ్. తన కుటుంబంతో సరదాగా బయటికి వెళ్లినప్పుడు ఆయన ఈ ఆటను ఆడారు. ఆ తర్వాత క్రమేపీ అది పికిల్ బాల్ గా రూపాంతరం చెందింది.
    3 / 6 పికిల్ బాల్ ను ఇండోర్, అవుట్ డోర్ విధానంలో ఆడేందుకు అవకాశం ఉంటుంది. సింగిల్స్ విభాగంలో ఇద్దరు.. డబుల్ విభాగంలో నలుగురు ఆడొచ్చు. మిక్స్ డ్ డబుల్స్ విభాగంలోనూ క్రీడాకారులు పోటీ పడొచ్చు.
    4 / 6 ఈ క్రీడలో పాడిల్ ను బ్యాట్ గా ఉపయోగిస్తారు. అత్యంత దృఢమైన ప్లాస్టిక్ బంతిని ఈ గేమ్ లో వినియోగిస్తారు. సింగిల్స్ విభాగంలో ఒక్క ఫాల్ట్ చేస్తే చాలు సర్వీస్ పోతుంది. డబుల్స్ లో మాత్రం ఒకసారి సర్వ్ చేసేందుకు అవకాశం ఉంటుంది.
    5 / 6 11 పాయింట్లు పూర్తికాగానే ఒక సెట్ ముగుస్తుంది. పికిల్ బాల్ లో కేవలం రెండు పాయింట్లు వ్యత్యాసంతోనే విన్నర్ ను అనౌన్స్ చేస్తారు.
    6 / 6 ఈ గేమ్ లో లాంగ్ సర్వీస్ చేసినప్పుడు కచ్చితంగా బంతి నెట్ ను దాటి వెళ్లాల్సిందే.. ఒకవేళ సర్వ్ చేసిన బంతిని నో వ్యాలీ జోన్ దగ్గర ఎట్టి పరిస్థితుల్లో అందుకోవద్దు.