Top 5 Selling Cars : ఒకడుగు వెనక్కి వేసిన వ్యాగన్ ఆర్.. నెంబర్ వన్ 1 స్థానంలో టాటా కారు.. అమ్మకాల్లో టాప్ 5 కార్లు ఇవే..

ఇటీవల టాటా పంచ్ మోడల్ ను టాటా కంపెనీకి చెందిన పంచ్ బీట్ చేసింది. వ్యాగన్ ఆర్ కంటే ఎక్కువగా పంచ్ కార్లు సేల్స్ ఎక్కువగా నమోదు అయ్యాయి. ఆటోమోబైల్ రీసెచ్చ్ సంస్థ జాటో డైనమిక్స్ ఇటీవల కార్ల అమ్మకాల గురించి విడుదల చేసింది. ఈ సంస్థ ప్రకారం టాటా పంచ్ తరువాత ఏ యే కార్లు టాప్ లో ఉన్నాయో చూద్దాం..

Written By: Srinivas, Updated On : August 23, 2024 3:03 pm

Top 5 Selling Cars

Follow us on

Top 5 Selling Cars : కాలం మారుతున్న కొద్దీ కార్ల విక్రయం పెరిగిపోతుంది. కంపనీలు ఏ కొత్త కారు మార్కెట్లోకి తీసుకొచ్చినా దాని గురించి కారు వినియోగదారులు తెలుసుకుంటున్నారు. అయితే దేశంలో మారుతి కంపెనీ కార్ల ఉత్పత్తిలో అగ్రగామిగా నిలుస్తూ ఉంటోంది. దశాబ్దాలుగా ఈ కంపెనీ కార్లు సేల్స్ లో ముందుంటున్నాయి. దీని నుంచి వెలువడిన వ్యాగన్ ఆర్ గురించి తెలియని వారు ఉండరు. హ్యాచ్ బ్యాక్ వేరియంట్ అయిన ఈ మోడల్ ను అత్యధిక వినియోగదారులు సొంతం చేసుకున్నారు. అయితే ఇటీవల ఈ మోడల్ ను టాటా కంపెనీకి చెందిన పంచ్ బీట్ చేసింది. వ్యాగన్ ఆర్ కంటే ఎక్కువగా పంచ్ కార్లు సేల్స్ ఎక్కువగా నమోదు అయ్యాయి. ఆటోమోబైల్ రీసెచ్చ్ సంస్థ జాటో డైనమిక్స్ ఇటీవల కార్ల అమ్మకాల గురించి విడుదల చేసింది. ఈ సంస్థ ప్రకారం టాటా పంచ్ తరువాత ఏ యే కార్లు టాప్ లో ఉన్నాయో చూద్దాం..

దేశీయ ఆటోమోబైల్ మార్కెట్లో టాటా కంపెనీకి చెందిన పంచ్ సత్తా చాటుతోంది. ఇప్పటికే మారుతి వ్యాగన్ ఆర్ కు పోటీగా ఈ మోడల్ మార్కెట్లోకి వచ్చింది. కానీ ఆ కారును బీట్ చేయలేకపోంది. కానీ ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకు తేలిన అమ్మకాల లెక్కల్లో వ్యాగన్ ఆర్ ను మించిన అమ్మకాలు పంచ్ సొంతం చేసుకుంది. ఆ డేటా ప్రకారం ఈ ఏడునెల్లో పంచ్ 1.26 లక్షల యూనిట్లు విక్రయించింది. టాటా పంచ్ ప్రస్తుతం మార్కెట్లో 7.60 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు.

టాటా పంచ్ తరువాత అమ్మకాల్లో వ్యాగన్ ఆర్ నిలిచింది. వ్యాగన్ ఆర్ దశాబ్దాలుగా మార్కెట్లో ఉంది. దీనిని బీట్ చేయడానికి ఎన్నో కార్లు మార్కెట్లోకి వచ్చాయి. కానీ నేటి వినియోగదారులు సైతం దీనిని కొనుగోలు చేస్తున్నారు. 2024 జనవరి నుంచి జూలై వరకు వ్యాగన్ ఆర్ ను 1.16 లక్షల మంది వినియోగదారులు సొంతం చేసుకున్నారు. వ్యాగన్ ఆర్ లో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో 21.5 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. దీనిని రూ. 5.54 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారుే.

జనవరి నుంచి జూలై వరకు జరిగిన కార్ల అమ్మకాల్లో హ్యుందాయ్ కంపెనీకి చెందిన క్రెటా మూడో స్థానంలో నిలిచింది. ఈ కారును ఈ ఏడు నెలల్లో 1.09 లక్షల మంది కొనుగోలు చేశారు. 5 సీటర్ కూడిన ఈ కారు ధర మార్కెట్లో 11.00 లక్షలు ఉంది. ఇది మొత్తం 28 వేరియంట్లలో అందుబాటులో ఉంది.

మారుతికి చెందిన మరో కారు బ్రెజ్జా అమ్మకాల్లో నాలుగో స్థానంలో నిలిచింది. ఈ కాలంలో ఈ కారును 1,05 లక్షల యూనిట్లు అమ్ముడు పోయాయి. మారుతి బ్రెజ్జాను రూ.8.34 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. టాప్ ఎండ్ రూ.14. 14 లక్షల వరకు విక్రయిస్తున్నారు. 1492 సీసీ ఇంజిన్ తో నడిచే ఈ కారు 86.63 బీహెచ్ పీ పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. 121.5 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

మారుతి కంపెనీకి చెందిన మరో కారు ఎర్టిగా అమ్మకాల్లో టాప్ 5లో నిలిచింది. 7 సీటర్ కారు అయిన దీనిని రూ.8 లక్షల ప్రారంభధరతో విక్రయిస్తున్నారు. ట్రావెల్ తో పాటు పర్సనల్ అవసరాలకు ఈ కారును ఎక్కువగా కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది.