Diwali : దీపావళి కానుకగా చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో కొన్ని సినిమాలు మంచి విజయాలను అందుకుంటే మరికొన్ని సినిమాలు మాత్రం డిజాస్టర్ బాట పట్టాయనే చెప్పాలి. ఇక అందరూ ఊహించిన సినిమాలు డిజాస్టర్ అవ్వడం ఎవరు ఊహించని సినిమాలు సక్సెస్ లను సాధించడం అనేది ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది…
క
కిరణ్ అబ్బవరం హీరోగా సుజీత్ సందీప్ దర్శకత్వంలో వచ్చిన క సినిమా ప్రేక్షకుల అంచనాల మేరకు సూపర్ సక్సెస్ ని సాధించింది. నిజానికి క సినిమా స్క్రీన్ ప్లే చాలా అద్భుతంగా ఉండడంతోనే ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ ఇంపాక్ట్ ను ఇచ్చిందనే చెప్పాలి. సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారనే చెప్పడంతో ఈ సినిమాకి మౌత్ పబ్లిసిటీ కూడా భారీగా జరిగింది. తద్వార ఈ సినిమా భారీ కలెక్షన్లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుంది…
లక్కీ భాస్కర్
దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన లక్కీ భాస్కర్ సినిమా ప్రేక్షకుల అంచనాల మేరకు మించి సూపర్ సక్సెస్ ను సాధించిందనే చెప్పాలి. ఇక ఈ సినిమా రిలీజ్ సమయంలో ఈ మూవీ మీద పెద్దగా అంచనాలైతే లేవు. కానీ ఒక్కసారి సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రతి ప్రేక్షకుడు కూడా ఈ సినిమా చూడ్డానికి ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగారు అంటే నిజంగా ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉందనే చెప్పాలి…
అమరన్
శివ కార్తికేయన్ హీరోగా, సాయి పల్లవి హీరోయిన్ గా వచ్చిన అమరన్ సినిమా ముకుంద్ వరద రాజన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. ఇక ఆ గురించి ఈ సినిమాలో చాలా బాగా చూపించారు. దాంతో ఈ సినిమా భారీ కలెక్షన్స్ ను సాధించింది. ఇక ఈ తెలుగు తమిళంలో భారీ సక్సెస్ ను సాధించే దిశగా ముందుకు దూసుకెళ్తుంది…
బఘీర
కన్నడ సినిమా ఇండస్ట్రీలో ప్రశాంత్ నీల్ తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్నాడు.ఇక కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా ఎదిగాడు. ఇక తను కథా మాటలు అందించిన బఘీర సినిమా ప్రేక్షకులను అంత బాగా మెప్పించలేక పోయిందనే చెప్పాలి.
ఇలా దీపావళి కి రిలీజ్ అయిన ఈ సినిమాల్లో మూడు సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధిస్తే ఈ సినిమా మాత్రం డిజాస్టర్ టాక్ ను దక్కించుకుంది. ఇక ప్రశాంత్ నీల్ లాంటి డైరెక్టర్ అందించిన కథ కావడం వల్ల ఆయన కూడా ఈ సినిమా ప్లాప్ అవ్వడం పట్ల చాలా విమర్శలను ఎదుర్కొంటున్నాడు…