https://oktelugu.com/

Samantha: బరితెగించిన సమంత..అవేమి లిప్ లాక్స్ బాబోయ్..ఇందుకోసమే నాగ చైతన్య కి విడాకులు ఇచ్చిందా?

ఈ వెబ్ సిరీస్ లో సమంత బోల్డ్ అడల్ట్ సన్నివేశాలను చూసి ఆమె అభిమానులు ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా హీరో వరుణ్ ధావన్ తో చేసిన లిప్ లాక్ సన్నివేశాలు కుర్రాళ్లలో హీటెక్కించాయి. సమంత ఇంతకు ముందు కూడా ఇలాంటి సన్నివేశాల్లో నటించింది కానీ, ఈ స్థాయిలో బోల్డ్ గా మాత్రం ఎప్పుడూ చేయలేదు.

Written By:
  • Vicky
  • , Updated On : November 7, 2024 / 01:02 PM IST

    Samantha(6)

    Follow us on

    Samantha: చాలా కాలం తర్వాత హీరోయిన్ సమంత ‘సిటాడెల్’ అనే హిందీ వెబ్ సిరీస్ తో నేడు మన ముందుకు వచ్చింది. అమెజాన్ ప్రైమ్ లో తెలుగు,హిందీ,తమిళం మరియు ఇతర ప్రాంతీయ భాషల్లో ఈ చిత్రం అందుబాటులోకి వచ్చింది. హాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిల్చిన ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ కి ఈ చిత్రం రీమేక్ గా తెరకెక్కింది. ఇందులో వరుణ్ ధావన్ హీరో గా నటించాడు. ‘రా’ యాక్షన్ డ్రామాగా ఈ వెబ్ సిరీస్ ని తెరకెక్కించాడు డైరెక్టర్స్ రాజ్ & డీకే. గతంలో వీళ్లిద్దరు కలిసి తెరకెక్కించిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 లో సమంత ని విలన్ గా చూపించి అందరినీ ఆశ్చర్యపోయేలా చేసారు ఈ డైరెక్టర్స్. ఇప్పుడు ఆమెని యాక్షన్ హీరో కి ఏమాత్రం తీసిపోని పాత్రలో ‘సిటాడెల్’ సిరీస్ ద్వారా చూపించారు. ఈ వెబ్ సిరీస్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.

    అదే విధంగా ఈ వెబ్ సిరీస్ లో సమంత బోల్డ్ అడల్ట్ సన్నివేశాలను చూసి ఆమె అభిమానులు ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా హీరో వరుణ్ ధావన్ తో చేసిన లిప్ లాక్ సన్నివేశాలు కుర్రాళ్లలో హీటెక్కించాయి. సమంత ఇంతకు ముందు కూడా ఇలాంటి సన్నివేశాల్లో నటించింది కానీ, ఈ స్థాయిలో బోల్డ్ గా మాత్రం ఎప్పుడూ చేయలేదు. హాలీవుడ్ లో హీరో హీరోయిన్ల మధ్య ఎలాంటి ఘాటు రొమాంటిక్ లిప్ లాక్ సన్నివేశాలు ఉంటాయో, ఈ వెబ్ సిరీస్ లో కూడా అలాంటి సన్నివేశాలే ఉన్నాయి. సమంత లాగానే మన టాలీవుడ్ హీరోయిన్లు మన ఇండస్ట్రీ ని దాటి పక్క ఇండస్ట్రీ కి వెళ్లి ఇలా తయారవుతున్నారు. తమన్నా ఒకప్పుడు టాలీవుడ్, కోలీవుడ్ లలో ముద్దు సన్నివేశాలకు నో చెప్పేది. ఆ కండీషన్ మీదనే ఆమె అగ్రీమెంట్స్ కూడా చేసుకునేది. అలాంటి రేంజ్ నుండి ఈరోజు ఆమె బాలీవుడ్ లో బోల్డ్ అడల్ట్ సన్నివేశాలు చేసే స్థాయికి ఎదిగిందంటే అర్థం చేసుకోవచ్చు, ఆమెలో ఎంత మార్పు వచ్చిందో.

    ఇప్పుడు సమంత కూడా ఆమె బాటలోనే నడుస్తుంది. ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ సిరీస్ లో సమంత కొన్ని హాట్ సన్నివేశాల్లో నటించడం అప్పట్లో పెద్ద వివాదాలకు దారి తీసింది. పెళ్ళైన అమ్మాయి ఇలాంటి సన్నివేశాల్లో ఎలా నటించింది అంటూ అప్పట్లో చర్చ నడిచింది. ఈ విషయం లో సమంత, నాగ చైతన్య మధ్య విభేదాలు కూడా వచ్చాయంటూ అప్పట్లో టాక్ వినిపించేది. బహుశా అదంతా నిజమేనేమో. సమంత ని బాలీవుడ్ చిత్రాల్లో నటించొద్దని అక్కినేని ఫ్యామిలీ కండీషన్ పెట్టిందని, అలా పెట్టడం వల్లే సమంత విడాకులు తీసుకుందని సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ఈ వార్త చక్కర్లు కొట్టింది. ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో తెలియదు కానీ, సమంత ఇలాంటి బోల్డ్ సన్నివేశాల్లో నటిస్తే అందరూ అప్పట్లో ప్రచారమైన ఈ వార్త ని నమ్మే పరిస్థితి వస్తుంది.