Kiran Abbavaram : హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు కిరణ్ అబ్బవరం… ప్రస్తుతం ఈ కుర్ర హీరో మంచి సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. ఇక ఇంతకుముందు రొటీన్ రొట్ట ఫార్ములా సినిమాలను చేస్తూ తన నటనలో కూడా పెద్దగా వైవిధ్యాన్ని చూపించకుండా భారీ ప్లాప్ లను మూట గట్టుకున్నాడు. మరి ఇలాంటి స్టార్ హీరో ప్రస్తుతం తనదైన రీతిలో సినిమాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన క సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఆయన ఇక మీదట కూడా సస్పెన్స్ సినిమాలకు ఎక్కువ ప్రియార్టీ ఇస్తున్నట్టుగా తెలుస్తోంది…మరి ఎలాంటి సబ్జెక్టులైతే ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తాయో ఆ సినిమాలే వాళ్ళకి సక్సెస్ లని కూడా కట్టబెడతాయి. ఇక ఈజీగా ఈ సినిమాలని సక్సెస్ లుగా కన్వర్ట్ చేయొచ్చు. అందువల్ల థ్రిల్లర్ సబ్జెక్ట్ లను ఎంచుకొని మంచి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు…ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకోవడంలో కిరణ్ అబ్బవరం సక్సెస్ అయ్యాడు. ఇక ఇప్పుడు ఆయన పాన్ ఇండియా హీరోగా కూడా కొనసాగే అవకాశాలైతే ఉన్నాయి. ఇక ఏది ఏమైనా కూడా కిరణ్ అబ్బవరం లాంటి నటుడు సోలోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఇక్కడ ఎదురయ్యే కాంపిటీషన్ తట్టుకొని మరి ఒక సక్సెస్ ఫుల్ హీరోగా ఎదగడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే ఆయనకి జూనియర్ ఎన్టీయార్ నటించిన ‘అరవింద సామెత వీర రాఘవ’ సినిమా అంటే చాలా ఇష్టమట…ఆ సినిమాను ఇప్పటికీ చాలా సార్లు చూశాడట…ఇక ఆ సినిమాలో ఎన్టీయార్ చెప్పే డైలాగ్స్ అంటే తనకి చాలా ఇష్టమని కూడా చెప్పడం విశేషం…
ఇక ఇదిలా ఉంటే జీరో గా మొదలైన కిరణ్ అబ్బవరం స్టార్ హీరోల ఇన్స్పిరేషన్ తో హీరోగా మారాడు. ఇక ఇప్పుడు ఆయన హీరోగా మారడం తనకు చాలా వరకు ప్లస్ అయింది. ఇక ఎప్పుడైతే ఆయన తన కెరియర్ ని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకోవడం స్టార్ట్ చేశాడో అప్పటినుంచి మంచి విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతున్నాడు.
ఇక రీసెంట్ గానే మ్యారేజ్ చేసుకున్న కిరణ్ అబ్బవరం సక్సెస్ లను కూడా అందుకోవడం మంచి విషయం… ఇక క సినిమాకి సీక్వెల్ ను కూడా అనౌన్స్ చేసిన మేకర్స్ తొందర్లోనే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ మొత్తాన్ని కంప్లీట్ చేసి సెట్స్ మీదకు తీసుకెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నారు…
ఇక ఈ గ్యాప్ లోనే కిరణ్ అబ్బవరం మరొక సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు…చూడాలి మరి కిరణ్ అబ్బవరం ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాడు అనేది…ఇక మొత్తానికైతే తనకంటూ ఒక ఐడెంటిటి ని ఏర్పాటు చేసుకోవడం లో కిరణ్ అబ్బవరం కొంచెం ముందు వరుసలో ఉన్నాడనే చెప్పాలి…