Homeఆంధ్రప్రదేశ్‌Former minister Jogi Ramesh : జోగి పార్టీ మారుతారు సరే.. చేర్చుకునేది ఎవరు?

Former minister Jogi Ramesh : జోగి పార్టీ మారుతారు సరే.. చేర్చుకునేది ఎవరు?

Former minister Jogi Ramesh :  మాజీ మంత్రి జోగి రమేష్ టిడిపిలో చేరతారా? అందుకే సైలెంట్ అయ్యారా? వైసీపీ సైతం ఆశలు వదులుకుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. గత కొద్దిరోజులుగా జోగి రమేష్ టిడిపిలో చేరతారని జోరుగా ప్రచారం సాగుతోంది. వాస్తవానికి ఆయన వైసీపీకి వీర విధేయుడు. అధినేత జగన్ కు అత్యంత ఆప్తుడు. అయితే ఆయనపై చంద్రబాబు ఇంటి పై దాడి, కుమారుడుపై అగ్రిగోల్డ్ భూముల కేసులు నడుస్తున్నాయి. ఇద్దరూ విచారణను ఎదుర్కొంటున్నారు. ఇలా వరుస కేసులతో సతమతం అవుతుండడంతో జోగి రమేష్ పార్టీ మారాలన్న ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. టిడిపిలోని సన్నిహితుల వద్ద పార్టీలో చేరతానని చెప్పినట్లు సమాచారం. దీనిపై టిడిపి హై కమాండ్ తర్జనభర్జన పడుతోంది. ఇలా కేసులు ఎదుర్కొంటున్న వారు టిడిపిలో చేరితే తప్పుడు సంకేతాలు వెళతాయని భావిస్తున్నట్లు సమాచారం.అయినా సరే జోగి రమేష్ విషయంలో..జగన్ ఆత్మస్థైర్యం పై దెబ్బ కొట్టేలా.. ప్రత్యేక వ్యూహం రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే జోగి రమేష్ చేరిక విషయంలో మరి కొద్ది రోజులు ఆగాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. అదే వైసీపీ అధినేత జగన్ పై జోగి రమేష్ ను ప్రయోగించబోతున్నారన్న టాక్ కూడా వినిపిస్తోంది.

* ఆ దూకుడుకు నచ్చే
వైసిపి హయాంలో ఎమ్మెల్యేగా ఉన్న జోగి రమేష్.. అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటిపై దండయాత్ర చేశారు. కేవలం రాజకీయపరంగా జగన్ పై చంద్రబాబు విమర్శలు చేయడంతో.. ఒక్కసారిగా దండేత్తే ప్రయత్నం చేశారు. అక్కడకు కొద్ది రోజులకే జోగి రమేష్ కు మంత్రి పదవి లభించింది. కేవలం చంద్రబాబు ఇంటిపై దాడికి ప్రయత్నం చేసినందుకే జగన్.. జోగి రమేష్ ను నెత్తిన పెట్టుకున్నట్లు ప్రచారం సాగింది అప్పట్లో.అయితే గత మూడు సంవత్సరాలుగా చాలా దూకుడుగా వ్యవహరించారు జోగి రమేష్. అదే ఇప్పుడు ఇబ్బందికరంగా మారింది. కేసుల రూపంలో వెంటాడుతోంది.

* అడ్డుకుంటున్న వసంత కృష్ణ ప్రసాద్
వైసీపీ హయాంలో మైలవరం ఎమ్మెల్యేగా వసంత కృష్ణ ప్రసాద్ ఉండేవారు. జోగి రమేష్ ఆయన నియోజకవర్గంలో వేలి పెట్టడంతోనే వసంత కృష్ణ ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై చాలాసార్లు పంచాయితీ కూడా జరిగింది. అయితే జగన్ జోగి రమేష్ ను వెనుకేసుకొచ్చారు. దీంతో వసంత కృష్ణ ప్రసాద్ పునరాలోచనలో పడ్డారు. వెంటనే తెలుగుదేశం పార్టీలో చేరారు. జగన్ మైలవరం టికెట్ ను వసంత కృష్ణ ప్రసాద్ కు ఆఫర్ చేసినా ఆయన వినలేదు. కేవలం జోగి రమేష్ వైఖరి నచ్చకపోవడంతోనే అప్పట్లో వసంత కృష్ణ ప్రసాద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు జోగి రమేష్ టిడిపిలో చేరుతామని ముందుకు వచ్చినా.. వసంత కృష్ణ ప్రసాద్ అడ్డుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే జోగి రమేష్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో టిడిపిలో చేరి.. కేసుల నుంచి విముక్తి కావాలని భావిస్తున్నట్లు సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version