Shambhala Trailer Review: నటుడు సాయికుమార్ కొడుకు ఆది సాయికుమార్ హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. కెరియర్ స్టార్టింగ్ లో ‘ప్రేమ కావాలి’, లవ్లీ లాంటి సినిమాలతో హీరోగా తనను తాను ప్రూవ్ చేసుకున్న ఆది ఈ మధ్యకాలంలో వరుస సినిమాలు చేస్తున్నప్పటికి అవేవి అతనికి ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి… ఇక ఈనెల 25వ తేదీన క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘శంబాల’ సినిమా మీదనే అతను పూర్తి కాన్ఫిడెంట్ పెట్టుకున్నాడు… ఇక ఈ సినిమా గ్లింప్స్ నుంచి కూడా ప్రేక్షకుల్లో ఒక అటెన్షన్ క్రియేట్ చేస్తూ వచ్చింది. గత కొద్దిసేపటికి క్రితమే ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. అది చూస్తుంటే సినిమా మీద అంచనాలుతార స్థాయికి చేరిపోయాయి. ప్రతి షాట్ కూడా డిఫరెంట్ వే లో ప్రజెంట్ చేసినట్టుగా తెలుస్తోంది. అలాగే ఆది సాయికుమార్ ఈ మధ్యకాలంలో ఏ సినిమాలో నటించని విధంగా ఈ సినిమాలో చాలా అద్భుతంగా నటించినట్టుగా తెలుస్తోంది. దర్శకుడు ఈ సినిమా పాయింట్ నుంచి చాలా స్ట్రెయిట్ గా క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేశాడనే విషయమైతే మనకు ట్రైలర్ ను చూస్తే అర్థమవుతోంది.
ఈ సినిమా కథ కూడా చాలా ఎక్సైటింగ్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది. మూఢనమ్మకాలను నమ్మే ప్రజల్లో హీరో ఎలా చైతన్యం తీసుకొచ్చాడు. అసలు ఆ ఊరు ను పట్టి పీడిస్తున్నది ఎవరు? కావాలనే కొంతమంది జనాల్లో భయాన్ని పుట్టిస్తున్నారా? అనేది తెలుపడానికి ఈ సినిమాను డిజైన్ చేసినట్టుగా తెలుస్తోంది. ప్రతి సీన్లో ఒక ఇంటెన్స్ కనిపించబోతున్నట్టుగా అర్థమవుతోంది.
ఈ సినిమాలో విజువల్స్ కొంతవరకు బాగున్నప్పటికి ఇంకాస్త గ్రాండీయార్ జోడిస్తే బాగుండేది. ఆ విజువల్స్ లో క్వాలిటీ సిజీ వర్క్ అక్కడక్కడ తెలిసిపోతోంది. కానీ తమకున్న బడ్జెట్ పరిధిలో సినిమాని బాగా తీసినట్టుగా అర్థమతోంది. ట్రైలర్ లో వచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది.
ఈ సినిమా ఈ 25వ తేదీన ప్రేక్షకులను మెప్పిస్తుందంటూ ప్రతి ఒక్కరు చాలా కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి ఈ సినిమాతో ఆది సాయికుమార్ గొప్ప సక్సెస్ ని సాధిస్తాడా లేదా అనేది…అది తో పాటు ఇండస్ట్రీ కి వచ్చిన ప్రతి ఒక్క హీరో గొప్ప విజయాలను సాధిస్తుంటే ఆయన మాత్రం ఇంకా ఒక్క సక్సెస్ సాధించడానికి ఇబ్బంది పడుతున్నాడు. కాబట్టి ఈ సినిమా తను అనుకున్న సక్సెస్ ను అందిస్తుందా లేదా అనేది చూడాలి….
