Gray Divorce: బాలీవుడ్ బెస్ట్ కపుల్ గా గుర్తింపు సంపాదించుకున్న ఐశ్వర్య బచ్చన్-అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకుంటున్నారని కొంత కాలంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే, ఈ వార్తలపై వారు ఎటువంటి కామెంట్లు చేయలేదు. పైగా ఖండించనూ లేదు కూడా. దీంతో వీరి ఫ్యాన్స్ మనస్సులో భయాందోళనలు కలుగుతున్నాయి. ఐశ్వర్య, అభిషేక్ దాదాపుగా ఎక్కడ కూడా కలిసి కనిపించడం లేదు. వీరి విడాకులు, వీరి మధ్య మనస్పర్థల గురించి అప్పుడప్పుడు కొంత మంది సెలబ్రెటీలు చెప్తున్నా.. అందులో నిజా నిజాలను కూడా ఈ జంట ఖండిచకపోవడం గమనార్హం. ఇటీవల, ఈ జంటకు సంబంధించిన విషయాలను నటి నిమ్రత్ కౌర్ ప్రస్తావించింది. ఈమె వ్యాఖ్యలు ఐశ్వర్య, అభిషేక్ మధ్య విభేదాల గురించి ఆన్‌లైన్‌లో మరింత ఊహాగానాలకు ఆజ్యం పోసింది. ఈ జంట ‘గ్రే డైవర్స్’ తీసుకుంటుందన్న వార్తలతో అసలు గ్రే డైవర్స్ అంటే ఏంటి? అని నెటిజన్లు తెలుసుకోవాలని కుతూహలంగా ఉన్నారు. ‘గ్రే డైవర్స్’అంటే ఏంటి..? ఇది ఎందుకో తెలుసుకుందాం.
గ్రే డైవర్స్ అనేది వృద్ధ జంటలు, సాధారణంగా 50 ఏళ్లు పైబడిన వారు తీసుకునేవి. ఇక తమ వైవాహిక జీవితాన్ని ముగించాలని ఈ నిర్ణయం తీసుకుంటారు. గ్రే విడాకుల రేటు ప్రపంచ వ్యాప్తంగా పెరిగినప్పటికీ, ఈ ధోరణి ఇటీవల భారతదేశంలో ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. విదేశాలలో ఎక్కువ మంది గ్రే డైవర్స్ తీసుకుంటారు. వృద్ధాప్యంలో కూడా స్వీయ-పరిపూర్ణత, స్వాతంత్ర్యం, జీవిత మార్పుల కోసం వ్యక్తుల కోరికకు ఈ ధోరణి ఎక్కువగా ఉంటుంది.
పాశ్చాత్య దేశాల్లో ‘గ్రే డైవర్స్’ ద్వారా వెళ్లేవారికి కొన్నిసార్లు ‘సిల్వర్ స్ల్పిటర్స్’ అని పిలుస్తారు. ఇది వారి వివాహాలను ముగించేందుకు ఎంచుకున్న వృద్ధ జంటలకు పదం. ఈ ధోరణి ఒకప్పుడు అసాధారణం అయితే, ఇది ప్రపంచ వ్యాప్తంగా క్రమంగా పెరుగుతోంది. సంప్రదాయకంగా, భారతీయ సమాజం వివాహాన్ని జీవితకాలం కలిసి ఉండే ప్రమాణంగా చూస్తుంది. సామాజిక అంచనాలు, విడాకుల చుట్టూ ఉన్న కళంకం కారణంగా వైవాహిక జీవితంలో సవాళ్లు ఉన్నప్పటికీ చనిపోయే వరకు కలిసే ఉంటారు.
గ్రే విడాకుల్లో ముఖ్యమైన అంశం స్త్రీలలో పెరుగుతున్న ఆర్థిక స్వాతంత్రం. ఎక్కువ మంది మహిళలు వర్క్‌ఫోర్స్‌లోకి ప్రవేశించడం, ఆర్థిక స్థిరత్వాన్ని సాధించడంతో, ఆర్థిక భద్రత కోసం వారు తమ జీవిత భాగస్వాములపై తక్కువ ఆధారపడతారు.
ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ గురించి మాట్లాడితే.. అభిషేక్ కొన్ని నెలల క్రితం పారిస్‌లో ఉన్నప్పుడు వారి వైవాహిక జీవితంలో మనస్పర్థలున్నాయన్న పుకార్లు వ్యాపించాయి. ఐశ్వర్యతో అతని వివాహం గురించి ఒక విలేఖరి అడిగినప్పుడు, అతను కేవలం ‘నో కామెంట్’ అని బదులిచ్చాడు. ఆ సమయంలో తన మ్యారేజ్ రింగ్ ను చూపించాడు. వారు ఇప్పటికీ కలిసి ఉన్నారని చెప్పకనే చెప్పాడన్నమాట. నవంబర్ 2న ఐశ్వర్య పుట్టినరోజు సందర్భంగా బచ్చన్ కుటుంబానికి చెందిన ఎవరూ ఆమెకు సోషల్ మీడియాలో బహిరంగంగా శుభాకాంక్షలు చెప్పకపోవడాన్ని అభిమానులు గమనించి గ్రే డైవర్స్ పై మరిన్ని ఊహాగానాలు పెరిగాయి.