Bangladesh Protest: బంగ్లాదేశ్.. రెండేళ్ల క్రితం వరకు భారత్‌కు మంచి మిత్రదేశం.. వాణిజ్యపరంగానూ ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగాయి. అయితే రిజర్వేషన్ల విషయంలో చెలరేగిన అల్లర్లు చెలరేగడంతో ప్రధాని షేక్ హసీనా పదవికి రాజీనామా చేయడంతోపాటు దేశం వీడారు. తర్వాత మహ్మద్ యూనస్ నేతృత్వంలో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం భారత వ్యతిరేక విధానాలు అవలంబించడంతోపాటు అక్కడి యువతను భారత్‌కు వ్యతిరేకంగా చెచ్చగొడుతోంది. చైనా, పాకిస్తాన్‌కు అనుకూలంగా వ్యవహరిస్తోంది. కొంతమంది నాయకులు యువతను రెచ్చగొట్టేందుకు ‘విద్యుత్ రాకపోతే భారత డబ్బులు ఆగిపోతాయి, భారత్ మొత్తం బంగ్లాదేశ్‌పై ఆధారపడి ఉంది’ అంటూ తప్పుడు వాదనలు చేస్తున్నారు. ఈ ప్రచారం ఉద్యమాన్ని రాజకీయ ఆయుధంగా మార్చేస్తోంది. యువతలో జాతీయవాద భావాలను భారత్ వ్యతిరేకతతో ముడిపెట్టి, వారిని తమ వైపు ఆకర్షిస్తున్నారు.
షేక్ హసీనా పతనానికి కుట్రలు..
ఉద్యమం మూలం షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చివేయడమే. భారత మిత్రురాలిగా పేరుగాంచిన హసీనా, 1971 యుద్ధంలో భారత సహాయంతో బంగ్లాదేశ్ స్వాతంత్య్రం సాధించిన సంగతి తెలిసిందే. ముప్పుతో భారత్‌లో ఆమెకు ఆశ్రయం ఇవ్వడం, అప్పగించాలనే డిమాండ్లకు సహకరించకపోవడం వల్ల భారత్‌పై కోపం పెరిగింది. ఇస్లామిక్ సంస్థలు ఈ అవకాశాన్ని పీకి, భారత అనుకూలులను ‘దేశ ద్రోహులు‘గా ముద్ర వేస్తున్నాయి. 2026 ఎన్నికల సందర్భంగా తమ బలాన్ని పెంచుకోవడానికి ఈ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు.
షరీఫ్ ఉస్మాన్ హత్యతో మళ్లీ అల్లర్లు..
విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ బిన్ హాదీ హత్య ఘటన బంగ్లాదేశ్‌ను కుదిపేసింది. దాడి చేసినవారు భారత్‌కు పారిపోయారనే పుకార్లు, సోషల్ మీడియాలో వ్యాప్తి చెందాయి. భారత్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటోందని ఆరోపిస్తూ యువతను రోడ్లపైకి ఆకర్షించారు. జమాతే ఇస్లామీ వంటి సమూహాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భారత్‌ను బంగ్లాదేశ్ వ్యతిరేక శక్తిగా చిత్రీకరిస్తున్నాయి.
చైనా–పాక్ సపోర్ట్‌తో..
భారత ప్రభావం తగ్గితే లాభపడే చైనా, పాకిస్తాన్ సోషల్ మీడియా ద్వారా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయి. సరిహద్దు కాల్పులు, తీస్తా నది నీటి వివాదాలను పెంచి చూపిస్తూ భారత్‌ను శత్రువుగా ప్రచారం చేస్తున్నారు. ఇది సాధారణ ఉద్యమాన్ని రాజకీయ ఆయుధంగా మలిచేసింది. ఫలితంగా బంగ్లాదేశ్ యువతలో ద్వేష భావాలు పెరుగుతున్నాయి. భారత్–బంగ్ల సంబంధాలు దెబ్బతింటాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.