హైదరాబాదులోని ఐకానిక్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో అత్యద్భుతమైన ఆలయ నేపథ్య సెటప్‌తో సాంప్రదాయంగా నాగ చైతన్య, శోభితా ధూళిపాళల వివాహం జరిగింది.
అక్కినేని నాగేశ్వరరావు (ANR) విగ్రహాన్ని ఆవిష్కరించినప్పటి నుంచి, దిగ్గజ నటుడు-నిర్మాత జన్మ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని జరుగుతున్న మొదటి ప్రధాన వేడుక ఇది.
అందుకే ఈ ప్రత్యేక సందర్భానికి అపారమైన సెంటిమెంట్ విలువ ఉంది.
రాత్రి 8:13 గంటలకు శుభ ముహూర్తం సందర్భంగా వీరి పెళ్లి జరిగింది.
తెలుగు సంప్రదాయాలకు అద్దం పట్టేలా, పెద్దల ఆధ్వర్యంలో ఆచార వ్యవహారాలతో అంగరంగ వైభవంగా వీరి వివాహం వేడుక కన్నుల పండుగగా సాగింది.
ఈ మహత్తర క్షణాన్ని చూసేందుకు తరలి వచ్చిన కుటుంబ సభ్యులు, స్నేహితుల హృదయపూర్వక ఆశీర్వాదాలతో వారిని దీవించారు.
ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు, సన్నిహితులతో పాటు పలువురు ప్రముఖులు కూడా హాజరయ్యారు.
చై, శోభిత అన్నపూర్ణ స్టూడియోస్‌లో వారి ప్రయాణాన్ని ప్రారంభించడం మాకు చాలా సంతోషంగా ఉందన్నారు నాగార్జున.
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.