ఆకాశ రంజన్ కపూర్ న్యూ ఇయర్ ట్రెండ్ సృష్టించింది అనుకోండి.
ఆమె దుస్తులతో పాటు హెయిర్‌స్టైల్, మేకప్ ఆమెను సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్‌గా మార్చాయి.
ఆకాశ రంజన్ కపూర్ అమెరికాకు చెందిన నటి. కానీ భారతదేశంలో కూడా గుర్తింపు సంపాదించింది.
ఈమె నటించిన సినిమాలు కొన్ని ఫేమస్ అయ్యాయి. అయితే ఈమె హిందీ చిత్రాలలోని తన పాత్రల గురించి అభిమానులు మాట్లాడుకుంటారు కూడా.
ఆమె 2020లో నెట్‌ఫ్లిక్స్ చిత్రం గిల్టీతో తొలిసారిగా కనిపించింది. ఈ సినిమాలో ఆమె అత్యాచార బాధితురాలిగా నటించింది.
ఆమె నటనకు ఉత్తమ సహాయ నటి (మహిళ) నామినేషన్ లభించింది. కపూర్ TLCలో డీకోడెడ్ ఫ్యాషన్ సిరీస్‌తో 2019లో తన కెరీర్‌ని ప్రారంభించింది.
ఇది వినోద ప్రపంచంలోకి ఆమె మొదటి అడుగు అనే చెప్పాలి. తర్వాత అపర్శక్తి ఖురానాతో కలిసి నటించిన తేరే దో నైనా అనే మ్యూజిక్ వీడియోలో కనిపించింది.
ఏది ఏమైనా ఈమె దుస్తుల కలెక్షన్స్ మాత్రం అదరహో అనిపిస్తాయి. భలే ముస్తాబు అవుతుంది ఈ బ్యూటీ.