https://oktelugu.com/

Viral Video: ఫ్యూజులు ఎగిరిపోయాయి.. ఇదెక్కడి డ్యాష్ లో ప్రోగ్రాం రా మావా!

వెనుకటి రోజుల్లో టీవీల్లో ప్రోగ్రాంలు వస్తున్నాయంటే చాలు ఇంటిల్లిపాది మొత్తం టీవీకి అతుక్కుపోయేవారు. ఆ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత కూడా వాటి గురించి చర్చించుకునేవారు.. కథలు కథలుగా చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు అలా ఉందా.. అలాంటి పరిస్థితులు ఉన్నాయా.. ఈ ప్రశ్నకు లేదు అనే సమాధానమే చెప్పాల్సి ఉంటుంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : January 2, 2025 / 06:02 PM IST

    Viral Video(1)

    Follow us on

    Viral Video: స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగిన తర్వాత.. ప్రతిదీ చేరువైపోయింది. తినే తిండి నుంచి.. వేసుకునే బట్టలు దాకా అన్నీ కూడా దాని ద్వారానే సమకూరడానికి మార్గాలు ఏర్పడ్డాయి. కానీ ఇదే సమయంలో విలువలు నాశనమయ్యాయి. వలువలు లేకుండా పోయాయి. స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగిన తర్వాత ఓటీటీలు అందుబాటులోకి వచ్చాయి.. వాటిల్లో ప్రోగ్రాములు పెరిగిపోయాయి. అయితే జనరంజకం అనే కాన్సెప్ట్ ను పక్కనపెట్టి.. పెద్దలకు మాత్రమే అనే తీరుగా కార్యక్రమాలు ఉండడంతో.. చూసేవాళ్ళు కళ్ళు, చెవులు మూసుకోవాల్సి వస్తోంది..

    డ్యాష్ లో ప్రోగ్రాం

    సాధారణంగా మనం ఎవరినైనా తిట్టే సందర్భంలో.. డ్యాష్ అనే పదాన్ని వాడతాం. ఆపదాన్ని వాడడానికి ప్రధాన కారణం.. దాని వెనుక బూతు ఉందని..ఆ బూతు వినడానికి బాగోదని.. అయితే ఓ ఓటీటీ లో టెలికాస్ట్ అయ్యే ఓ ప్రోగ్రాం లో.. ప్రజెంటర్ ఇష్టానుసారంగా బూతులు వాడింది. ప్రతి సందర్భంలో డ్యాష్ అనే పదాన్ని దర్జాగా ఉపయోగించింది.. మీ డ్యాష్ సైజు ఎంత అనే ప్రశ్నను షో కు వచ్చిన గెస్ట్ లను అడిగింది. అందులో లేడీ గెస్ట్ 37 అని.. మేల్ గెస్ట్ 8 అని చెప్పాడు. అలా వారు సమాధానాలు చెబుతున్న సమయంలో సిగ్గుపడుతూ కనిపించారు. దీంతో చూసేవాళ్ళకు వేరే విధంగా అర్థమైంది. వాస్తవానికి ఇలాంటి కార్యక్రమాలు ఒక వర్గం వారు ఇష్టపడతారేమో గాని.. మిగతావాళ్లు చూసేందుకు కూడా ఇష్టపడరు. అందువల్లే ఆ ఓ టి టి సంస్థ అంతగా దూసుకుపోవటం లేదు. ఆశించినంత స్థాయిలో అభివృద్ధి చెందడం లేదు. ఇలాంటి బూతు షో ల వల్ల సభ్య సమాజానికి వారు ఏం మెసేజ్ ఇస్తున్నారో ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిది. అన్నట్టు ఈ బూతు మాటలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చర్చకు కారణమైంది. ఇలాంటి షోలు నడిపిస్తున్న నిర్వాహకులపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. సినిమాలకు ఉన్నట్టుగానే ఓటీటీలకు కూడా సెన్సార్ ఉండాలని గుర్తు చేస్తున్నారు.

    ఈ కార్యక్రమమే కాదు.. ఆ ఓటీటీ లో ప్రసారమయ్యే మిగతా కార్యక్రమాలను ఇదే స్థాయిలో బూతులు ఉంటాయి. చెప్పడానికి వీల్లేని.. రాయడానికి అవకాశం లేని స్థాయిలో అవి ఉంటాయి. అందువల్లే ఆ షో లు కేవలం యూత్ మాత్రమే చూస్తున్నారు. వాటిని చూసి సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. వైరల్ కంటెంట్ అని చెప్పి భుజాలు తడుముకోవడం వరకే ఆ ఓటిటి సంస్థ పరిమితమవుతోంది. ఇంతకంటే భావ దారిద్ర్యం మరొకటి ఉంటుందా.. అందుకే చెప్పుకునే ప్రోగ్రాములు నిర్వహించాలి. గొప్పగా భావించే కార్యక్రమాలనే ప్రసారం చేయాలి. అప్పుడే అవి జనాదరణ పొందుతాయి.