
దేశరాజధాని ఢిల్లీలో ఈ రోజు తెల్లవారు జామున పోలీసులకు, క్రిమినల్స్ కి మధ్య జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు నేరగాళ్లు చనిపోయారు. గతంలో నేరగాళ్లపై పలు నేరారోపణ కేసులు ఉన్నాయి. దింతో ఖురేషి, బహదూర్‌ల కోసం కరవాల్‌నగర్ మర్డర్ కేసు సహా పలు కేసుల్లో ఢిల్లీ పోలీసులు గాలిస్తున్నారు. చట్టం కళ్ళు కప్పి పోలీసులకు దొరకకుండ తిరుగుతున్న రాజా ఖురేష్, రమేష్ బహాదుర్ లను పోలీసులు మట్టుబెట్టారు.